pop

బాధలో ఉన్నప్పుడు మద్యం ఎందుకు తాగాలనిపిస్తుందో తెలుసా ?-Why Do We Crave For Alcohol In Bad Mood Or Stress ?


Changes In Ions Levels Chloride Potassium Why Do We Crave For Alcohol Bad Mood Or Stress ? Photo,Image,Pics-పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయి, ఇంట్లో భార్యతో గొడవలు, లవ్ ఫేల్యూర్, ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్, అలసట .. ఇలా ఎలాంటి మానసిక సమస్య వల డిప్రెషన్ లేదా స్ట్రెస్ కి లోనైతే, అందరు మొదట వాడే మందు మద్యం. పార్వతి దూరమైనందుకు దేవదాసు మందు బాటిల్ ఎందుకు పట్టి ఉంటాడు? ఏ చిన్న సమస్య చెప్పుకోవాలన్నా, మిత్రులతో మద్యం పార్టి ఎందుకు ప్లాన్ చేస్తారు ? అసలు బాధలో మందుకు ఎందుకు తాగాలనిపిస్తుంది ? బాధగా ఉన్నాం కాబట్టి తాగుతున్నాం అంటే అసంపూర్ణమైన జవాబే. మరి మద్యం బాధలో ఎందుకు గుర్తుకు వస్తుందో చూద్దామా ! బాధలో ఉన్నప్పుడు, లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడు రివార్డ్ సెంటర్ లో చాలా మార్పులు జరుగుతాయట. పొటాషియం, క్లోరైడ్, మిగితా అయాన్స్ లెవెల్స్ జరిగే మార్పుల వలనే మద్యం తాగాలని, మద్యం ఇంకా ఎక్కువ తాగాలని అనిపిస్తుందట. ఎందుకంటే మన మెదడు అప్పటికే మద్యం బాధలకి కాసేపు విరామం ఇచ్చే మందుగా గుర్తింపు పొంది ఉంటుంది. దీనిపై ఓ పరిశోధన చేసారు. స్ట్రెస్ హార్మోన్స్ ని బ్లాక్ చేసినప్పుడు మద్యం తాగాలని అనిపించలేదట పాల్గొన్నవారికి. అదే బాధలో ఉన్నవారు మద్యం ఇంకా ఎక్కువ కావాలని అడిగారట. అదండీ .. అర్థం అయ్యిందా బాధలో మద్యం ఎందుకు ఎక్కువ తాగాలనిపిస్తుందో !

No comments:

Powered by Blogger.