pop

17 సెంట్ల భూమిలో 15 క్వింటాళ్ల ధాన్యం


వరి ఉత్పత్తిలో మరో రికార్డు సృష్టించినట్లు ఫాదర్‌ ఆఫ్‌ హైబ్రీడ్‌ రైస్‌ యువాన్‌ లంగ్‌పింగ్‌ ప్రకటించారు. చైనాకు చెందిన ఈ శాస్త్రవేత్త గతంలోనూ రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి చేశారు. తాజాగా 837 చదరపు గజాల(0.07హెక్టార్లు)లో 1537 కిలోల వడ్లు పండించి గతంలో తాను సృష్టించిన రికార్డును బద్దలు కొట్టానని వివరించారు. అంటే 17 సెంట్ల భూమిలో 15 క్వింటాళ్ల ధాన్యాన్ని పండించారన్న మాట. ఈ సాంకేతికతను ఐదోతరం హైబ్రీడ్‌ రైస్‌ టెక్నాలజీగా ఆయన అభివర్ణించారు. ఇటీవల జపాన్‌ ఉత్పత్తి చేసిన కోషిహికారి రైస్‌ తరహాలోనే ప్రస్తుతం ఉత్పత్తి చేసిన వడ్లు కూడా అత్యుత్తమ నాణ్యత కలిగి ఉన్నాయని తెలిపారు. కాగా, గత యాభై ఏళ్లుగా వరి ఉత్పత్తిలో పరిశోధనలు చేస్తున్న యువాన్‌ గతంలో ఎన్నో రికార్డులు సృష్టించారు. చైనా మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రారంభించిన హైబ్రీడ్‌ రైస్‌ బ్రీడింగ్‌ పోగ్రామ్‌లో భాగంగా 2000 సంవత్సరంలో హెక్టారుకు 1.05 టన్నుల వరిని ఉత్పత్తి చేశారు. 2014లో నాలుగో దశలో ఈ లక్ష్యాన్ని 15.4 టన్నులుగా నిర్దారించగా.. యువాన్‌ తన బృందంతో దీనినీ అధిగమించాడు.

No comments:

Powered by Blogger.