pop

ప్రేయసికి 3.5 కిలోల బంగారం... ప్రియురాలి భర్తను చంపిన బ్యాంక్ మేనేజర్


gopalakrishna-vineelaకొన్నిసార్లు పచ్చగా సాగిపోతున్న సంసారంలో నిప్పులు కురుస్తాయి. అనుకోకుండా కలిగిన కష్టం కాస్తా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. గత నెల అక్టోబరు 29 రాత్రి 10.30 గంటలకు అంతా దీపావళి టపాసులు కాలుస్తూ సంతోషంతో కేరింతలు కొడుతుంటే మౌలాలి హౌసింగు బోర్డులోని ఓ ఇంట్లో ఓ వ్యక్తి అతి దారుణంగా హత్య చేయబడ్డాడు. అతడు వేసిన చావు కేకలు టపాసుల మోతలో కలిసిపోయాయి. అతడి శరీరంపైన 50కి పైగా కత్తిపోట్లున్నాయి. అసలు ఇంతకీ అతడిని చంపింది ఎవరు? కారణం ఏమిటి? gopalakrishna-vineela మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి వచ్చి అదే ప్లాటులో నివాసముంటున్నవారిని విచారించారు. తమకేమీ తెలియదన్నారు అంతా. ఆ తర్వాత తల్లిని అడిగారు. ఆమె కూడా హత్య ఎలా జరిగిందో తెలియదని చెప్పింది. దీనితో పోలీసులు అతడి భార్యకు ఫోన్ చేశారు. ఆమె తను ఖమ్మంలో ఉన్నట్లు చెప్పింది. ఐతే ఆ తర్వాత పోలీసులు నేరుగా వెళ్లి ఆమెను అరెస్టు చేశారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. వివరాల్లోకి వెళితే... 2012లో విజయవాడకు చెందిన నాగ వినీలతో వరంగల్ జిల్లాకు చెందిన గోపాలకృష్ణకు వివాహమైంది. వీరి కాపురం 3 ఏళ్లు సజావుగానే సాగింది. గోపాలకృష్ణ చిన్నచిన్న వ్యాపారాలు చేస్తుండేవాడు. కానీ ఏదీ కలిసి రాలేదు. దీనితో తన వద్ద ఉన్న బంగారం, భార్య నగలు అన్నీ కలిపి బ్యాంకులో కుదువపెట్టి 70 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బుతో డెయిరీ బిజినెస్ పెట్టాడు. మొదట్లో కాస్త లాభం వచ్చినట్లనిపించినా ఆ తర్వాత తీవ్ర నష్టాలు వచ్చాయి. దీనితో అతడు బ్యాంకులో తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేకపోయాడు. బ్యాంకు మేనేజర్ రవీందర్ నేరుగా గోపాలకృష్ణ ఇంటికి డబ్బు కట్టాలని సూచించాడు. తను పడుతున్న ఇబ్బందులను గోపాలకృష్ణ వివరించాడు. ఐతే తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టేందుకు తనకు రూ. 10 లక్షల సాయం చేయాలని కోరాడు. రవీందర్ ఆ డబ్బు సర్దాడు. ఐతే గోపాలకృష్ణకు మాత్రం రాబడి లేకుండా పోయింది. దీనితో రవీందర్ ఇంటికి వచ్చి దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. అవి తట్టుకోలేక అతడు ఇంటికి వచ్చినపుడల్లా భార్యను ముందుకు నెట్టి సమాధానం చెప్పాల్సిందిగా కోరేవారు. అలా సమాధానం చెప్పే క్రమంలో రవీందర్ తో వినీలి సన్నిహిత సంబంధం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక రవీందర్ కూడా ఆమెకు భరోసా ఇచ్చేశాడు. ఎలాగైనా భర్తను వదిలేసి వెళ్లాలని నిర్ణయించుకున్న వినీల తన నగలు తనకు తెచ్చి ఇవ్వాలని గొడవకు దిగింది. దానికి అతడు ప్రస్తుతానికి డబ్బు లేదని రాగానే తెచ్చి ఇస్తానన్నాడు. ఐతే తను ఇంట్లో ఉండనని చెప్పి పుట్టింటికి వెళుతున్నట్లుగా వెళ్లిపోయింది. కానీ ఆమె వెళ్లింది సూర్యాపేటకు. అక్కడ రవీందర్, ఆమె ఇద్దరూ కలిసి సహజీవనం మొదలుపెట్టారు. ఇదిలావుండగా రవీందర్ కు గోపాలకృష్ణ ఫోన్ చేసి తన నగలు తనకు ఇవ్వాలని కోరాడు. డబ్బు ఇస్తేనే నగలు వస్తాయన్నాడు. దానితో గోపాలకృష్ణ మౌలాలిలో ఉన్న ఓ ప్లాటును అమ్మి రూ. 10 లక్షలు రవీందరుకు ఇచ్చాడు. తన నగలు గురించి అడిగితే అవి వేలంలో పోయాయన్నాడు. తనకు చెప్పకుండా వేలంలో ఎలా పోతాయంటూ ప్రశ్నించిన గోపాలకృష్ణ, విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళతానని చెప్పాడు. ఐతే ఆ నగలను విడిపించి తన ప్రేయసి, గోపాలకృష్ణ భార్య అయిన వినీలకే ఇచ్చాడు రవీందర్. విషయం బయటపడుతుందనుకున్న రవీందర్, వినీల ఇద్దరూ గోపాలకృష్ణను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నలుగురు రౌడీ షీటర్లను మాట్లాడి అక్టోబరు 29వ తేదీన నేరుగా మౌలాలి వచ్చారు. ఆ సమయంలో దీపావళి టపాసులు కాలుస్తూ అంతా హడావుడిలో ఉన్నారు. నలుగురు రౌడీ షీటర్లకు సిగ్నల్స్ ఇస్తూ వినీల కూడా అక్కడికి వచ్చింది. పైకి వెళ్లి ఇంట్లో తన భర్తతో పాటు పిల్లలు ఉండటాన్ని చూసి వారికి టపాసులు కొనిస్తానంటూ కిందకు తీసుకువచ్చింది. అలా వస్తూనే రౌడీ షీటర్లకు సిగ్నల్ ఇచ్చింది. వారు నేరుగా ఇంట్లోకి వెళ్లి అతడిని దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. వినీల కూడా ఏమీ ఎరుగనట్లు వెళ్లిపోయింది. కానీ ఆమె ఆ రోజు అక్కడికి వచ్చినట్లు సీసీ కెమేరాలో రికార్డయింది. దీని ఆధారంగా పోలీసులు ఈ హత్య మిస్టరీని ఛేదించారు. కాగా వినీల 6 నెలల గర్భవతిగా ఉంది. ఆమెతోపాటు రవీందర్, నలుగురు రౌడీ షీటర్లను పోలీసులు అరెస్టు చేశారు

No comments:

Powered by Blogger.