pop

ఇండియాకు ఇంకో షాక్


ఇండియాకు ఇంకో షాక్ఇండియాకు ఇంకో షాక్ మొన్నటి రాత్రి నుంచి ఇండియాకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. 500.. 1000 నోట్ల రద్దు నిర్ణయం భారత జనాలకు మామూలు షాక్ కాదు. దీని వల్ల సామాన్య జనానికి అంతిమంగా మంచే జరిగినా.. ప్రస్తుతానికైతే అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోవైపు అమెరికా ఎన్నికల ఫలితాలు కూడా భారతీయులకు పెద్ద షాకే. మెజారిటీ జనాలు హిల్లరీనే గెలవాలని ఆకాంక్షించారు. ఆమే గెలుస్తుందని కూడా నమ్మారు. ఐతే ఇప్పుడు ఇండియన్స్ కు ఇంకో షాక్ తగిలింది. ఐతే పై రెండు షాకుల్లాగా అది అంత ప్రభావం చూపేది కాదులెండి. ఆ షాక్ ఏంటంటే.. క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టు టీమ్ ఇండియాపై భారీ స్కోరు చేయడం. సొంతగడ్డపై టీమ్ ఇండియా గత రెండు మూడేళ్లుగా ఎలాంటి ఫాంలో ఉందో చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది నెంబర్ వన్ టెస్టు జట్టు దక్షిణాఫ్రికాను 3-0తో చిత్తు చేసి.. తాజాగా న్యూజిలాండ్ జట్టును కూడా అంతే తేడాతో మట్టి కరిపించి ఇంగ్లాండ్ సిరీస్ కు రెడీ అయింది భారత్. మరోవైపు ఇంగ్లాండ్.. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు చేతిలో పరాభవం చవిచూసి భారత పర్యటనకు వచ్చింది. దీంతో సిరీస్ ఏకపక్షమని.. ఇంగ్లాండ్ భారత్ ధాటికి తట్టుకోలేదని అంతా అంచనా వేశారు. కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి. తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 537 పరుగులు చేసింది. తొలి రోజు జో రూట్ {124} సెంచరీ కొడితే.. రెండో రోజు మొయిన్ అలీ {117}, స్టోక్స్ {128} శతకాలు బాదారు. ఇంగ్లాండ్ జట్టును వణికించేస్తాడనుకున్న అశ్విన్ సహా భారత బౌలర్లందరూ ఫెయిలయ్యారు. రెండో రోజు ఆట ఆఖరుకు భారత్ 63/0తో నిలిచింది. ఇప్పుడిక ఇంగ్లాండ్ ను ఓడించడం గురించి భారత్ ఆలోచించే పరిస్థితే లేదు. ఓటమి తప్పించుకుని.. డ్రా చేయడం మీదే దృష్టిపెట్టాలి భారత్. ఈ మ్యాచ్ ఇలా సాగుతుందని అస్సలు ఊహించని భారత అభిమానులకు ఇది పెద్ద షాకే.

No comments:

Powered by Blogger.