pop

4G పాతబడిపోయింది 5G వచ్చేస్తోంది-5G Services To Roll Out In China

5g In 2020 Services To Roll Out China Mukesh Ambani Telecom Operators Photo,Image,Pics-
టెక్నాలజీ విషయంలో చైనా మనకంటే చాలా ముందంజలో ఉందని ఒప్పుకోవడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ముఖ్యంగా టెలికాం, మొబైల్ రంగంలో చైనా స్థానమే వేరు. ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా. ఇదంతా చెప్పేబదులు మన దేశానికి, చైనాకి మధ్యగల ఓ తేడా చెప్తాం వినండి. ఈ ఆర్టికల్ చదవుతున్నవారిలో ఎంతమంది దగ్గర 4G ఫోన్లు ఉండుంటాయి? మొన్న జియో వచ్చేదాకా మనకి అసలు 4G నెట్వర్క్ పై సరైన అవగాహనే లేదు. జియో 4G విప్లవం తీసుకొచ్చిన తరువాత కూడా మన దేశంలో 4G సేవలు పొందుతున్న వారు ఇంకా చాలా తక్కువే. ఇక్కడ 4G ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంటే చైనాలో 530 మిలియన్ల మంది 4G సేవల్ని వాడుతున్నారట. చైనాలో జనాలకి 4G బోర్ కొట్టేసిందట. అందుకే అక్కడ 5G సేవలు మొదలుపెట్టనున్నాయి టెలికాం సంస్థలు. ఇప్పటికే దాదాపు 100 నగరాల్లో 5G నెట్వర్క్ ట్రయల్స్ ని మొదలుపెట్టింది చైనా. 2018 పూర్తయ్యేలోపు టెస్ట్ వర్క్ ని పూర్తి చేసి, 2019 సంవత్సరంలో లోటుపాట్లను సరిచేసుకోని 2020 సంవత్సరంలో 5Gని పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది చైనా. ఈ 5G సేవలు, 4G స్పీడ్ తో పోలిస్తే 20 రేట్లు వేగవంతంగా ఉంటాయట. భారత్ లో ఈ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో ఇప్పుడే చెప్పలేం. 5G సేవలు అందుబాటులోకి రావాలంటే చాలా ఖర్చుపెట్టాలి కంపెనీలు, దానికి ప్రభుత్వ సహకారం చాలా అవసరం. అయితే ముఖేష్ అంబాని 5G సేవల ఆలోచనలో ఉండటం మనం ఆనందించదగ్గ విషయమే.

No comments:

Powered by Blogger.