pop

ఫోన్ బ్యాటరీ కాపాడుకునేందుకు కొన్ని సలహాలు-Tips To Save Your Mobile Battery


Low Bright Ness Protect Mobile Battery Reduce Screen Time Out Remove Useless Apps Use Default Charger ఫోన్ బ్యాటరీ కాపాడుకునేందుకు కొన్ని సలహాలు Photo,Image,Pics-స్మార్ట్ ఫోన్స్ ఎంత అధునాతనమైన స్క్రీన్ డిస్ప్లేతో వస్తయన్నాయో. రోజుకి ఎన్ని యాప్స్ స్టోర్ లోకి వస్తున్నాయో .. రికార్డింగ్, స్ట్రీమింగ్ .. రెండూ 4k దాకా వెళ్ళాయి ఇప్పుడు. కాని ఇవన్ని పెరుగుతూ బ్యాటరీ నిడివిని తగ్గిస్తున్నాయి. స్క్రీన్ డిస్ప్లే ఎంత ఎఫెక్టివ్ గా ఉండి, ఎంత పెద్దగా ఉంటే, అంత ఎక్కువగా బ్యాటరీ ఖర్చు అవుతుంది. అప్లికేషన్స్ కూడా ఎంత పెరిగిపోతే అంత ఎక్కువగా బ్యాటరీ డ్రెయిన్ అవుతంది. అందుకే, బ్యాటరీని కాపాడుకునేందుకు కొన్ని టిప్స్ మీకోసం. * అన్నటికన్నా ముందుగా, గుడ్డిగా బ్రాండ్ నేమ్ ని నమ్ముకోకుండా, మంచి బ్యాటరీ లైఫ్ తో వస్తున్న ఫోన్లేంటో చూడాండి. ఇప్పుడు 4000 mAh కి పైగా కెపాసిటితో స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ఇంకా 2000+ mAh యుగంలోనే మీరు ఉండిపోతే కష్టమే. * మీ ఫోన్ ద్వారా వచ్చిన కంపెనీ ఛార్జర్ ని మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి. డిఫాల్ట్ ఛార్జర్ ఇచ్చే బ్యాటరీ లైఫ్ ని బయటి ఛార్జర్స్ ఇవ్వలేవు. * పనికిరాని యాప్స్ తీసెయ్యండి. అలాగే పనిలేని సమయంలో ఫోన్ ని స్విచ్ఛాఫ్ చేసి పెడితే సరి. * పొరపాటులో కూడా పని పూర్తయ్యాక మొబైల్ డేటా ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పడుకునే సమయంలో WiFi కనెక్షన్ ఆఫ్ చేస్తే మంచిది. అలగే GPS మోడ్ ని అవసరమున్నప్పుడు తప్ప, ఎప్పుడూ ఆన్ చేసి ఉంచొద్దు. వైబ్రేషన్ మోడ్ కూడా అవసరమైతే తప్ప వద్దు. * స్క్రీన్ టైమ్ అవుట్ ని తగ్గించండి. అలాగే బ్రైట్ నెస్ కి తక్కువలో పెట్టండి. మనకు అర్థం కాదు కాని, స్క్రీన్ డిస్ప్లే మామూలుగా లాగేయదు బ్యాటరీని. * హీటింగ్ పెరిగినప్పుడు విశ్రాంతినివ్వండి అలాగే సాధ్యమైనంత వరకు హై డేటా గేమ్స్ ఆడొద్దు (నీడ్ ఫర్ స్పీడ్, బ్యాట్ మెన్ లాంటివి). * పెద్దగా అవసరం లేని నోటిఫికేషన్స్ ని ఆఫ్ లో పెట్టండి. అవుడ్ స్పీకర్ కన్న, హెడ్ ఫోన్స్ తో మీడియా ప్లే చేస్తే తక్కువ బ్యాటరీ ఖర్చవుతుంది. అలాగే బ్యాటరీ సేవింగ్ మోడ్ ని ఆన్ చేసి పెట్టాలి

No comments:

Powered by Blogger.