pop

అతనికి ఎలాంటి ఫ్రూఫ్స్ లేకుండా 6లక్షలకు కొత్త నోట్లు ఇచ్చేశారు!


హైద్రాబాద్: నోట్ల కోసం జనం నానా పాట్లు పడుతున్నారు. బ్యాంకుల ముందు గంటల తరబడి నిల్చొని నీరసంతో సొమ్మసిల్లిపోతున్నారు. అయితే కొందరు బ్యాంకు ఉద్యోగులు తమ స్వలాభం కోసం ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారు. జనానికి 2వేలు ఇవ్వడానికే విసుక్కుంటున్న ఈ తరుణంలో ఎలాంటి ఫ్రూఫ్స్ లేకుండా 6లక్షల రూపాయల కొత్త నోట్లను బ్యాంకు ఉద్యోగి బొక్కేశాడు. హైద్రాబాద్‌లోని సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను యాజమాన్యం సస్పెండ్ చేసింది. వారిద్దరిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సరూర్ నగర్ పరిధిలోని ఓ ప్రముఖ బ్యాంకులో వి.మహేష్ క్లర్క్‌గా, రాధిక అనే మహిళ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులమే కదా ఏది చేసిన చెల్లుతుందనుకున్నారో ఏమో, ఎలాంటి ఫూఫ్ర్ లేకుండా 6లక్షల రూపాయల విలువైన నోట్లను రాధిక మల్లేష్‌కు ఇచ్చింది. బ్యాంకు మేనేజర్ చేసిన తనిఖీల్లో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు మల్లేష్ దగ్గర్నుంచి 5.6లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు ఖర్చయినట్లు తెలిసింది. బ్యాంకు మేనేజర్ డి.నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని, ఈ మోసానికి పాల్పడితే సహించేది లేదని ఎల్బీ నగర్ అసిస్టెంట్ కమీషనర్ పి.వేణుగోపాల్ రావు హెచ్చరించారు.

No comments:

Powered by Blogger.