pop

వాట్సాప్ వీడియో కాల్ లింక్ స్కామ్


వాట్సాప్ వీడియో కాల్ లింక్ స్కామ్వాట్సాప్ వీడియో కాల్ లింక్ స్కామ్ ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ వాట్సాప్ ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన వీడియో కాలింగ్ అప్లికేషన్ ను అపుడే హ్యాకర్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. నిన్న, మొన్నటి వరకు బేటా వర్షన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్ వీడియో కాలింగ్ తాజాగా వాట్సాప్ యూజర్లకు అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫీచర్ ఇన్విటేషన్ ముసుగులో స్కామ్ భయం ఇపుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. వీడియో కాల్ ఇన్విటేషన్ పేరుతో మోసపూరిత లింక్స్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నాయని, వీటిని క్లిక్ చేయటం ద్వారా వాట్సాప్ అకౌంట్‌ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీడియో కాలింగ్ ఫీచర్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం...కేవలం ఇన్విటేషన్ ద్వారా మాత్రమే ఈ ఫీచర్ కి అనుమంతి వుందంటూ యూజర్లను ట్రాప్ చేసి, సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నారని టెక్ నిపుణులు తెలిపారు.ఇలాంటి మెసేజ్ ల పట్ల అప్రతమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మోసగాళ్ల ట్రాప్ లో కుండా కేవలం గూగుల్ ప్లే ద్వారా మాత్రమే వీడియో కాలింగ్ అప్లికేషన్ను డౌన్ లోడ్ చేసకోవాలని తెలిపారు. కాగా తాజాగా అధికారిక వాట్సాప్ అకౌంట్‌లలోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఉపయోగించుకుంటున్న యూజర్లు వాట్సాప్ వీడియో కాల్స్ నాణ్యత పై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ టు ఫేస్ కాల్స్ సమయంలో పి నాసిరకమైన వీడియో క్వాలిటీ పూర్ గా ఉందని, ఎక్కువ డేటాను ఖర్చవుతోందని వాదిస్తున్న సంగతి తెలిసిందే.

No comments:

Powered by Blogger.