pop

కరెన్సీ రద్దుతో ఆలయాల్లో పెరిగిన రద్దీ!!


గత రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నల్లధనాన్ని అదుపుచేయడంతోపాటు తీవ్రవాదాన్ని అడ్డుకునేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. దీని ప్రభావం దేవాయాలపై కూడా పడింది. ఈ ప్రకటనతో ఆలయాల్లో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇది ముఖ్యంగా చెన్నై నగరంలో ఎక్కువగా ఉంది. బుధవారం ఉదయం నుంచే చాలా దేవాలయాల్లో రద్దీ పెరిగింది. ఈ రోజు ఎలాంటి పర్యదినం కాకపోయిన ఆలయాల సందర్శనకు పెద్ద మొత్తంలో భక్తులు వస్తున్నారు....రద్దుచేసిన కరెన్సీ నోట్లను దేవస్థానం కౌంటర్లలో తీసుకోవడం లేదని అధికారులు తెలిపారు. పేదలకు అన్నదానం కోసం విరాళాలు ఇచ్చేవారిని చెక్కులు లేదా డీడీల రూపంలో చెల్లించాలని అధికారులు కోరుతున్నారు. దేవాలయ దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలను నగదు రూపంలో హుండీలో వేస్తారు. తమిళనాడు రాష్ట్రంలో సుబ్రమణ్య స్వామి ఆలయాల్లో ఏటా నిర్వహించే కంద షష్టి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచే కాకుండా మలేసియా, శ్రీలంక, ఆస్ట్రేలియా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. ఈ భక్తులు పెద్ద మొత్తంలో కానుకలను నగదు రూపంలో హుండీలో జమ చేస్తారు. వీటిలో పలణి, తిరుచెందూరు, తిరుపరన్కుంద్రమ్, తిరుత్తణి, మదురైలోని సుబ్రమణ్య ఆలయాల్లో హుండీలను తొందరా తెరచి వాటిలోని నగదును బ్యాంకుల్లో మార్చుకోవాలని తమిళనాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయించుకుంది. సాధారణంగా హుండీలను డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే తెరుస్తారు.

No comments:

Powered by Blogger.