pop

యూఎస్ సెనేటర్‌గా తొలి భారత మహిళ


కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ సెనేట్‌కు మంగళవారం (భారత కాలమానం ప్రకారం) ఎన్నికయ్యారు. దీంతో అమెరికా సెనేటర్‌గా ఎన్నికైన తొలి ఇండియన్-అమెరికన్‌గా 51 ఏళ్ల కమల నిలిచారు. తన సొంత రాష్ట్రం కాలిఫోర్నియా నుంచే ఆమె యూఎస్ సెనేట్‌కు ఎన్నికయ్యారు. సొంత పార్టీ డొమొక్రటిక్‌కే చెందిన లోరెట్టా సాంచెజ్‌పై 34.8 శాతం పాయింట్ల తేడాతో హారిస్ విజయం సాధించారు. కమలా హారిస్‌కు మొత్తంగా 1,904,714 ఓట్లు పోలయ్యాయి. హారిస్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ మద్దతు కలిసొచ్చింది. హారిస్ కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో జన్మించారు. ఆమె తల్లి అప్పట్లో చెన్నై నుంచి అమెరికా వలస వెళ్లారు. అక్కడ జమైకన్-అమెరికన్‌ను వివాహం చేసుకున్నారు. యూఎస్ సెనేట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగానే కాకుండా, కాలిఫోర్నియా నుంచి ఎన్నికైన మొట్ట మొదటి నల్లజాతి వ్యక్తి గాను కమల రికార్డు సృష్టించారు.

No comments:

Powered by Blogger.