pop

అడ్డంగా బుక్కయిన సోషల్ మీడియా స్టార్


బీజింగ్: ప్రజలకు డబ్బులు పంచుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ హీరోగా మారిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. చైనాకు చెందిన బ్రదర్ జీ అనే వ్యక్తి మారుమూల గ్రామాల ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తూ, ఆ దృశ్యాలను సామాజిక మధ్యమాల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేవాడు. దీంతో అతడు ఒక్కసారిగా సోషల్ మీడియా హీరోగా మారిపోయాడు. బోల్డంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల బయటపడిన ఓ వీడియో అతడిలోని మరో కోణాన్ని బయటపెట్టింది. అది బయటపడిన కాసేపటికే వైరల్ అయింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్సులోని మారుమూల గ్రామమైన లియంగ్‌షాన్ ప్రాంతంలో గ్రామస్తులకు డబ్బులు పంపిణీ చేశాడు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. లైవ్ స్ట్రీమింగ్ పూర్తయిన తర్వాత పంచిపెట్టిన డబ్బులను జీ అసిస్టెంట్ తిరిగి తీసుకుంటుండాన్ని ఎవరో చిత్రీకరించారు. ఇందులో జీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాడు. జీ నిర్వహిస్తున్న బ్లాగ్‌కు 6.6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. విషయం కాస్తా బయటపడిపోవడంతో జీ తన ఫాలోవర్ల ముందు చేసిన తప్పును ఒప్పుకున్నాడు. తనను క్షమించాల్సిందిగా కోరాడు. సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఆయన చేసిన గిమ్మిక్కులపై నెటిజన్లు మండిపడుతున్నారు. స్థానిక పోలీసులు అతడి లైవ్ స్ట్రీమింగ్‌ను అడ్డుకున్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

No comments:

Powered by Blogger.