pop

పెద్ద నోటు రద్దుపై కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు


న్యూఢిల్లీ: నోట్లరద్దు అంశంపై సుప్రీంకోర్టు మరోసారి స్పందించింది. పాత నోట్లు మార్చుకోవడానికి విధించిన గరిష్ట పరిమితిని రూ.4,500 నుంచి రూ.2000కు ఎందుకు తగ్గించారని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడడం తమదృష్టికి వచ్చిందని ధర్మాసనం పేర్కొంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న పాతపెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేశారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్. ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రూ.500, రూ.1000 రద్దు చేసిన ప్రభుత్వం రూ.100నోట్లను ఎందుకు అందుబాటులో ఉంచలేదని, ఓ వ్యక్తి ఒకరోజులో తీసుకునే డబ్బు గరిష్ట పరిమితిని ఎందుకు తగ్గించారని, డబ్బు ప్రింటింగ్‌కు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వారం రోజుల వ్యవధిలో కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇది రెండోసారి.

No comments:

Powered by Blogger.