pop

నోట్ల రద్దుపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు


హైదరాబాద్: ప్రముఖ నటుడు నాగబాబు నోట్ల రద్దుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతహాగా కాంగ్రెస్ సభ్యుడైన నాగబాబు బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని ప్రశంసించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంచి పని ఎవరు చేసినా అభినందించడాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని అన్నారు. తాను కాంగ్రెస్ సభ్యుడిని కాబట్టి అర్జెంటుగా మోదీని విమర్శించేయాలన్న అభిప్రాయం తనకు లేదని కుండబద్దలుగొట్టారు. ఏ నాయకుడు తీసుకోలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారని కొనియాడారు. నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కొట్టిపడేశారు. అవన్నీ అర్థంపర్థం లేనివన్నారు. తాటాకు చప్పుళ్లకు మోదీ భయపడరని, చావో రేవో తేల్చుకుంటారని అన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఓ మంచి నిర్ణయాన్ని తీసుకునే దమ్ము ఏ నాయకుడికీ లేకుండా పోయిందని విమర్శించారు. మెజారిటీ ఉన్నా మంచి నిర్ణయాన్ని తీసుకోలేని ప్రధానులు దేశంలో ఉన్నారన్నారు. తామరపువ్వు బురద లోంచే పుడుతుందని, ఇలాటి కుళ్లిన సమాజంలోంచి గొప్ప వ్యక్తి పుడతాడని మోదీని ఉద్దేశించి అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే పాలించేందుకు ఓ నియంత రావాలని, ఓ డిక్టేటర్ కావాలని అభిప్రాయపడ్డారు. నిజానికి తాను బీజేపీ సభ్యుడినో, మోదీ అభిమానినో కాదని పేర్కొన్న నాగబాబు నిజానికి బీజేపీ విధానాలపై తనకు కొంత వ్యతిరేకత కూడా ఉందన్నారు. చిరంజీవి కాంగ్రెస్‌లో చేరడంతో తామంతా కాంగ్రెస్ సభ్యులమయ్యామన్నారు. మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్‌సింగ్ వరకు అందరి గురించీ మాట్లాడారు. నాగబాబు ఇంకా ఏమన్నారో మీరూ వినండి.

No comments:

Powered by Blogger.