pop

శృంగారానికి మించింది అదొక్కటేనట!


లండన్: రోజురోజుకు ప్రజల ముంగిట్లోకి వచ్చి వాలుతున్న సాంకేతికత ప్రజల జీవితాలతో ఎంతగా పెనవేసుకుపోతున్నదీ చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలేమో. టెక్నాలజీకి ప్రజలు బానిసలైపోతున్నారనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. వై-ఫైకి దాసోహం అయిపోతున్న ప్రజలు తిండీతిప్పలను కూడా మర్చిపోతున్నారని తాజా అధ్యయనం ఒకటి బయటపెట్టింది. ప్రజలు తమ దైనందిన అవసరాలను సైతం వై-ఫై కోసం పక్కనపెడుతుండడం కలవరపెడుతోంది. ఇంకా ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే వై-ఫై కోసం శృంగారాన్ని సైతం పక్కనపెట్టేస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది. యూరప్, అమెరికాలలో ‘ఐపాస్‌’ అనే గ్లోబల్‌ మీడియా కనెక్టివిటీ సంస్థ 1700 మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ అలవాట్లను అధ్యయనం చేసింది. వారి పరిశోధనలో మానవ అవసరాలకంటే కూడా వై-ఫైకే వీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు తేలింది. సెక్స్, మద్యం, చాక్లెట్ల కంటే కూడా వై-ఫైకే అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని అధ్యయనకారులు గుర్తించినట్టు ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పేర్కొంది. ‘‘ఇంటర్నెట్‌ను అనుసంధానం చేసే వై-ఫై, ఇతర మానవ అవసరాలను అణచివేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే వాటిపై పైచేయి సాధిస్తోంది’’ అని ఐపాస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాట్ హ్యూమ్ పేర్కొన్నారు. పర్యాటకులు కూడా వై-ఫైకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన తెలిపారు. తాము బసచేయబోయే ప్రాంతంలో వై-ఫై సేవలు అందుబాటులో ఉన్నవీ, లేనివీ ముందే తెలుసుకుంటున్నారని అధ్యయనకారులు వివరించారు.

No comments:

Powered by Blogger.