pop

అమెరికాకు ఫస్ట్ ‘హాటెస్ట్’ లేడీ దొరికింది; వర్మ.


malainaదర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ‌ రూటే వేరు. రోమ్ త‌ల‌ల‌డిపోతున్నా ఫిడేలు వాయించుకొన్న నీరో చ‌క్ర‌వ‌ర్తిలా… ఆయన ఎదో ఒకటి వింతగా అంటూ వుంటాడు. ఇప్పుడు ఆయనకు యుఎస్ ఎన్నికలు దొరికాయి. ట్రంప్ విజయం ఓ థీసస్ చెప్పాడు వర్మ. ”హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఇప్పుడున్నట్టే ఉంటుంది. కొత్తగా ఏమీ జరగదు. అదే ట్రంప్ గెలిస్తే ఎప్పుడు ఏమి జరుగుతుందోననే టెన్షన్ ఒకటి ఉంటుంది. అలాగే మూస పద్ధతికి భిన్నంగా వ్యవహరించే వాళ్లంతా సక్సెస్ అవుతారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఎన్టీఆర్, ఇప్పుడు ట్రంప్‌.. వీళ్లంతా మూసపద్ధతికి భిన్నంగా వెళ్లినవాళ్లే. ట్రంప్ గెలుస్తారని నేనెప్పుడో చెప్పాను” అని చెప్పాడు వర్మ. అంతేకాదు ట్రంప్.. అబ్రహాం లింకన్, రూస్‌ వెల్ట్, జాన్ కెనడీ తదితరులందిరినీ మించిపోతారని , అమ్మాయిల గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన 60 ఏళ్ల వ్యక్తిని గెలిపించడం చూస్తుంటే… మనిషి ఆలోచనా ధోరణి అభివృద్ధి చెందినట్టుగా నాకు అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు ఆర్జీవి. ఇక ట్రంప్ భార్యను ఉద్దేశింఛి.. గత అధ్యక్షులు జార్జి వాషింగ్టన్ నుంచి ఒబామా వరకు చూస్తే అమెరికాకు ‘హాటెస్ట్ ఫస్ట్ లేడీ’ దొరికింది. గతంలోని ఫస్ట్ లేడీల కంటే ప్రస్తుత ఫస్ట్ లేడీ అంటే నాకు ఇష్టం. ఇందుకు నా కారణాలు నాకున్నాయి” తన శైలి పత్యం చూపించాడు వర్మ.

No comments:

Powered by Blogger.