pop

వాట్సాప్ వినియోగదారులకు మరో అద్భుత ఫీచర్ !


వీడియో కాలింగ్ ఫీచర్‌తో వినియోగదారులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన ‘వాట్సాప్’ మరోసరికొత్త ఫీచర్‌తో తమ వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. కొత్తగా స్నాప్‌చాట్ లాంటి ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంచింది. ఈ సరికొత్త ఫీచర్‌తో వినియోగదారులు ఫోటో, వీడియోలను తమకు కావాలసిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. డూడుల్స్, ఇమేజెస్, టెక్ట్‌ని ఫోటోలపై ఆకర్షణగా ఉంచవచ్చు. వాట్సాప్‌లో ‘స్టేటస్’ అనే పేరుతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి రానుంది. కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ ఫీచర్ వాట్సాప్‌లోని చాట్, కాలింగ్‌ ఆప్సన్ల మధ్య కొత్త టాబ్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఈ ఫీచర్‌లో ఉన్న మరోముఖ్యమైన విశేషమేమిటంటే వీడియో తీసుకుని మనుకు ఎలాకావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసిన ఫోటో లేదా వీడియో కేవలం 24 గంటలు మాత్రమే కనపడుతుంది. కానీ వాట్సాప్ నుంచి ఎవరికైనా పంపిస్తే మాత్రం అది ఎప్పటికీ డిలీట్ అయ్యే అవకాశం ఉండదు. 2013లో ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

No comments:

Powered by Blogger.