pop

రూ.2000 నోటు పై నిజాలు చెప్పిన అరుణ్‌జైట్లీ


notesరూ.500, రూ.1000 నోట్ల స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. మరింత భద్రతతో కూడిన నోట్లను ఆర్‌బీఐ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అయితే రూ.2000 నోట్ల‌లో చిప్ పెడ‌తార‌ని, అది సెక్యురిటీగ పనిచేస్తుంది ఎదో ప్రచారం జరిగింది మీడియాలో. ఇప్పుడు దీనిపై వివరణ ఇచ్చారు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ . రూ.2000 నోట్ల‌లో చిప్ పెడ‌తార‌న్న మాట ఎలా వ‌చ్చిందో త‌న‌కు అర్థం కావ‌ట్లేదని ,త‌న‌కు తెలిసినంత‌వ‌ర‌కు అలాంటిదేమీ లేద‌ని స్పష్టం చేశారు అరుణ్‌జైట్లీ. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి దేశంలో జీఎస్టీ స‌వ‌ర‌ణ బిల్లు అమ‌లులోకి వ‌స్తుంద‌ని, ఆ త‌రువాత ఎక్క‌డ ఏ న‌గ‌దు లావాదేవీలు జ‌రిపినా బ‌య‌ట‌ప‌డ‌తారని వివరించారు జైట్లీ. నగ‌దు బ‌దిలీ ప్ర‌క్రియ‌, ప్ర‌జ‌లు ఖ‌ర్చు చేసే న‌గ‌దు ప‌ద్ధ‌తుల్లో మార్పు వ‌స్తుందని, న్యాయ‌బ‌ద్ధంగా సంపాదించుకున్నప్పుడు బ్యాంకుల్లో జ‌మ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండ‌దని, న్యాయబద్దంగా వున్న వారు ఎక్కాడా భయపడాల్సిన అవసరం లేదని, వారు స్వేచ్చగా, హాయిగా జీవించ వచ్చిన వెల్లడించారు అరుణ్‌జైట్లీ.

No comments:

Powered by Blogger.