pop

సంపదలో బిచ్చగాడు, ప్రేమలో మహోన్నుడు


ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి రుజువైంది. లేమీలో.. కలిమిలోనూ, కష్టాల్లో.. నష్టాల్లోనూ, సుఖంలో..దుఖ:లోనూ...చివరికి నొప్పులు..రోగాల్లోనూ ప్రేమదే పైచేయిగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా మానూర్ మండలం మయికోడ్‌కు రాములు (52) కుష్ఠువ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన భార్య (ఆమె కొంతకాలం క్రితమే పరిచయమైంది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు) కవిత కూడా కుష్ఠువ్యాధితో బాధపడుతున్నారు. నా అన్నవారు కొద్దిమందే ఉన్నా..ఎవరికీ భారం కాకూడదని...హైదరాబాద్‌లో బిక్షాటన చేసుకుంటూ బతుకులీడ్చారు.
శనివారం కవిత తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయింది. ఏలాంటి సందర్భంలోనైనా తోడునీడగా ఉన్న భార్య చనిపోవడాన్ని భర్త రాములు జీర్ణించుకోలేకపోయాడు. అసలే బిక్షగాళ్లు...అడిగితే భార్య శవాన్ని సొంతూరికి తరలించేంత సాయం చేస్తారో లేదోనని వెనకడుగువేశాడు. సహాబిక్షగాడు ఇచ్చిన తోపుడుబండి (వికలాంగులు కూర్చునే చక్రాలబండి)లో భార్య శవంతో సొంతూరు బయలుదేరాడు. అప్పటికే 60 కి.మీలకు పైగా కాలినడకన వికారాబాద్ చేరుకున్నాడు. రామలు దీనస్థితికి చలించిన స్థానికులు...శవాన్ని ఇక్కడే దహనం చేస్తామని ముందుకొచ్చారు. కట్టుకున్న భార్యకు..సొంతూళ్లోనే దహన సంస్కారాలు చేయాలని వారికి ప్రార్థనపూర్వకంగా చెప్పాడు. రాములుకు భార్యపై ఉన్న ప్రేమను గమనించి స్థానికులు తలోచేయి వేశారు. స్థానికుల పోలీసుల సహకారంతో రాములు సొంతూరు భార్య శవాన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లాడు.
సొంతూళ్లో అన్న తప్ప రాములుకు ఎవరూ లేరు. కవిత చివరిసారిగా చూసుకునే అవకాశం ఆమె కుటుంబీకులు కల్పించాలని రాములు భావించాడు. ఆదివారం నాడు శవాన్ని అన్న ఇంటి దగ్గరే ఉంచి...కవిత కుటుంబ సభ్యులున్న కర్ణాటకలోని బీదర్ కు బయలుదేరాడు. రాములుతో పెళ్లికాకముందే కవితకు పుట్టిన పిల్లలను తీసుకొచ్చాడు. రాములు ఇంటికి వచ్చేలోపు ఆయన అన్న కవిత అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చేశాడు. అంతా రావడంతో రాములు తాను కొనుగోలు చేసిన పొలంలోనే భార్యకు అంత్యక్రియలు నిర్వహించాడు. విషయం తెలుసుకున్న ఊరి జనం, మండల అధికారులు రాములు భార్య అంత్యక్రియలు ఆర్థికసాయం చేశారు. సంపదలో బిక్షగాడైనా.. ప్రేమలో మహోన్నతుడిగా రాములు ఆయన భార్య గురించే చుట్టు పక్కల జనం గొప్పగా చెప్పుకుంటున్నారు.

No comments:

Powered by Blogger.