pop

హోటెళ్లలో పిల్లి బిర్యానీ వడ్డిస్తున్నారు!


మంచి మసాలాతో ఘుమఘుమలాడుతున్న బిర్యానీ అంటే ఎవరికి ఇష్టముండదు? లొట్టలేసుకొని తినే బిర్యానీ ప్రియులు ఎంతో మంది ఉన్నారు. అయితే మీరు తినేది చికెన్ బిర్యానీనా? మటన్ బిర్యానీనా? లేదా పిల్లి బిర్యానీనా? ముందు తెలుసుకోండి. ఎందుకంటే 'క్యాట్ బిర్యానీ' వండుతున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలో కొంతకాలంగా పుల్లులు మాయమవుతున్నాయి. వీధుల్లో పిల్లులు ఎక్కడా కనిపించడం లేదు. అయితే 'పీపుల్స్ ఫర్ ఏనిమల్స్' అనే స్వచ్ఛంద సంస్థ ఈ వ్యవహారంపై రహస్యంగా విచారణ చేపట్టింది. వీరి విచారణలో కళ్లుబయర్లు కమ్మే నిజాలు బయటకి వచ్చాయి. ఓ ముఠా వీధుల్లోని పిల్లులను దొంగలించి వాటిని బోనులో బంధిస్తున్నారు. ఆ తర్వాత బతికుండగానే వాటిని వేడి నీటిలో ఉడకబెడుతున్నారు. ఆ తర్వాత మాంసంగా మార్చి చెన్నైలోని వివిధ హోటెల్స్ కు, బిర్యానీ పాయింట్లకు సప్లై చేస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తుండటంతో కొంత మంది హోటెల్ నిర్వాహకులు ఈ పిల్లి మాసంతోనే బిర్యానీ వండి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పేరుతో వడ్డిస్తున్నారు.

No comments:

Powered by Blogger.