pop

సినిమా థియేటర్లలో పాత నోట్లు చెల్లుతాయట!


బెంగళూరు: ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సినిమా రంగం కుదేలైంది. చాలా సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించినా విడుదల చేయాలంటే నిర్మాతలు జంకుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడైనా దక్కుతుందో, లేదో అన్న అనుమానం వారిలో వ్యక్తమవుతోంది. తెలుగులో చాలా పెద్ద సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. రిలీజ్ అవ్వాల్సిన సినిమాల పరిస్థితి ఇది. మరి ఇప్పటికే విడుదలైన సినిమాల సంగతేంటి? జనం లేక వెక్కిరిస్తున్న థియేటర్లను చూసి నిర్మాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి కన్నడ సినీ పరిశ్రమ కంకణం కట్టుకుంది. శాండిల్‌వుడ్ సినీ ప్రేమికులకు తీపి కబురందించింది. నవంబర్ 30 వరకూ అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో పాత నోట్లను తీసుకుంటున్నట్లు థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. అయితే 90 రూపాయల టికెట్ తీసుకుని 410 రూపాయల చిల్లర అడిగి ఇబ్బంది పెట్టొద్దని యాజమాన్యాలు సూచించాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నాలుగైదు టికెట్స్ తీసుకుంటే పాత నోట్లను తీసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. డిస్ట్రిబ్యూటర్ మునిరాజు మాట్లాడుతూ డిసెంబర్ 30వరకూ నోట్లను మార్చుకునే అవకాశం ఉండటంతో పాత నోట్లు తీసుకోవాలనే నిర్ణయానికొచ్చినట్లు చెప్పారు.

No comments:

Powered by Blogger.