pop

అతడొక గ్రేట్‌ బాల్‌ బాయ్‌


అతడొక గ్రేట్‌ బాల్‌ బాయ్‌.. పేరు ధరమ్‌వీర్‌ పాల్‌. ఊరు..మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ సమీపంలోని మొరీనా జిల్లా..పిపార్శా గ్రామం. చిన్పప్పటి నుంచి క్రికెట్‌ అంటే ప్రాణం కానీ అతడికి చిన్నప్పుడే పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. కాళ్లు పనిచేయకపోయినా పాల్‌కు క్రికెట్‌ మీదున్న ఆసక్తి తగ్గలేదు. దివ్యాంగుడైనా దేశంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా అక్కడికి వెళ్లి చూసేవాడు. ఇదే అతనికి ప్లస్‌ అయింది. మధ్యప్రదేశ్‌ తరపున ఫిజికల్లీ డిసీజ్డ్‌ క్రికెట్‌ జట్టుకు సారథ్యం వహించి ఒంటిచేత్తో జట్టుకు విజయాలను దక్కించాడు. 2004 నుంచి ధరమ్‌వీర్‌ పాల్‌ దేశంలో ఎక్కడ క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగినా బాల్‌బాయ్‌గా వెళుతుంటాడు. గురువారం ఏసీఏ -వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో బాల్‌బాయ్‌గా సేవలందించాడు. అనంతరం భారత క్రీడాకారులతో కలిసి వామప్‌ చేశాడు. క్రీడాకారులకు ఇతడు బాల్‌ అందించడం చూస్తే ఇతడు దివ్యాంగుడు అనే అనుమానం అసలు కలగదు. అంత చురుగ్గా వ్యవహరిస్తాడు. భారత్‌తో పాటు అన్ని దేశాల క్రికెటర్లు అన్నా అభిమానమేనని ధరమ్‌వీర్‌ పాల్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాడు. పదో తరగతి వరకు చదివినా దేశమంతా తిరగడంతో ఇంగ్లీష్‌ బాగా మాట్లాడుతానని పాల్‌ తెలిపాడు. తనకు ముగ్గురు అక్కలు, ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారని పేర్కొన్నాడు. తన వృత్తి ధర్మంలో ఇసుమంతైనా విరామం లేకుండా సేవలందిస్తున్న ధరమ్‌వీర్‌పాల్‌కు అందరమూ హ్యాట్సాఫ్‌ చెబుదాం..

No comments:

Powered by Blogger.