pop

రోబోలని ఆఫీసర్లుగా పెట్టేసుకున్నారు అక్కడ -China Employs Robots As Customs Officers


Chinese Customs Officers Gongbei Hengqin In Zhuhai City And Zhongshan Intelligent Robots రోబోలని ఆఫీసర్లుగా పెట్టేసుకున్నారు అక్కడ Photo,Image,Pics-చిట్టి అనే రోబో వింత వింత పనులు చేస్తోంటే, తెరపై కనబడినందుకే కేరింతలు కొట్టాం, కోట్లవర్షం కురిపించాం. అలాంటి రోబో నిజంగా అనుమానస్పదంగా కనిపించిన మనుషుల్ని పట్టుకుంటే, ఏయిర్ పోర్టులో సెక్యూరిటీలాగా కాపల కాస్తోంటే, కస్టమ్స్ ఆఫీసర్స్ గా పనిచేస్తోంటే చూడాలని ఉందా! అయితే వెంటనే చైనా వెళ్ళండి. అక్కడే గవర్నమెంటు ఉద్యోగాలు ఇచ్చినట్లు రోబోలను ప్రభుత్వ పనుల మీద పెట్టుకుంటున్నారు. గాంగ్ బై, హెంగ్ క్విన్, జుహాయ్ సిటి, జోంగ్షాన్ పోర్టులలో పది ఇంటలిజెంట్ రోబోలను కస్టమ్స్ ఆఫీసర్లుగా నియమించిందట చైనా ప్రభుత్వం. అందులో ఓ రోబో పేరు షియో హై. ఈ రోబో పరిస్థితులను అర్థం చేసుకోగలదు, వినగలదు, కొత్త విషయాలు నేర్చుకోగలదు, మాట్లాడగలదు. ఈ రోబోల బ్యాచ్ కి 28 రకాల భాషలు మాట్లాడటం వచ్చంట. అలాగే ఆ భాషలకు సంబంధించిన మాండలికాలు కూడా మాట్లాడగలవంట. మాండరీన్, ఇంగ్లీష్, జపానీస్ ఇలాంటి భాషల్లో అనర్గళంగా మాట్లాడేస్తాయి అవి. ఇవి ముఖ కదలికలు, హావాభావాలను బట్టి అనుమానస్పదంగా తిరిగే మనుషులు కనిపిస్తే వెంటనే అలారం మోగిస్తాయట. వీటిని ప్రస్తుతానికైతే కొన్ని ఏయిర్ పోర్ట్స్ లోనే వాడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని కేంద్రాల్లో వీటి ద్వారా పనులు చేయించుకుంటామని చెబుతున్నారు చైనా అధికారులు.

No comments:

Powered by Blogger.