pop

మాంసాహారం ఎక్కువ తింటున్నారా? జాగ్రత్త!-Problem With Over Dependence On Non – Veg Food


Ldl Low-density Lipoprotein Non Vegetarian Diet Problem With Over Dependency On - Veg Food Photo,Image,Pics-ఎన్నో వేల సంవత్సరాలుగా నడుస్తున్న చర్చ, మాంసాహారం మంచిదా లేక శాకాహారం మంచిదా అని. మాంసాహారం పూర్తిగా మంచిది కాదని చెప్పలేం కాని, మాంసాహారంతో పొంచి ఉన్న ముప్పు అయితే శాకాహారంలో పెద్దగా కనబడదు. మాంసాహారం వలన లాభాలు లేవని కాదు. ఒంట్లో కావాల్సిన ప్రోటీన్లు ఎక్కువగా మాంసాహారంలోనే పొందుతాం మనం. అలాగని ప్లాంట్ ప్రోటీన్లని తక్కుగ అంచనా వేయటానికి లేదు. అయితే పూర్తిగా మాంసాహారం మీద ఆధారపడటం కాని, అతిగా మాంసాహారం తినటం కాని మంచి అలవాటు కాదని చెబుతున్నారు పరిశోధకలు. ఎందుకు అంటే మన శరీరంలో రెండురకాల కొవ్వులు ఉంటాయి. ఒకటి మంచి కొలెస్టరాల్. దీన్ని హెచ్డిఎల్ అని అంటారు. మరొకటి బ్యాడ్ కొలెస్టరాల్. దీన్ని ఎల్డీఎల్ అంటారు. మాంసాహారం అతిగా తినేవారి శరీరంలో బ్యాడ్ కొలెస్టరాల్ జమ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. మన రక్తంలో రెండురకాల కొవ్వులు 200 కి మించి ఉండకూడదు. ఎల్డిఎల్ 100 లోపే ఉండాలి. హెచ్డిఎల్ కనీసం 40 అయినా ఉండాలి. అలగే మరోరకమైన కొవ్వు ట్రైగ్లీజరైడ్స్ 150 లోపే ఉండాలి. అతిగా మాంసాహారం మీద ఆధారపడితే ఈ లెక్కలు ట్రాక్ తప్పొచ్చు. చికెన్, చేపలు, ఎగ్ వైట్ వలన బ్యాడ్ కొలెస్టెరాల్ ఎక్కువగా చేరదు. వీటిలో చేపలు, ఎగ్ వైట్ ఇంకా మేలు. అయితే ఎలాంటి మాంసాహారమైనా సరే ఉడకబెట్టినదే తినాలి తప్ప, వేయించినది కాదు. ఒక్క మాంసాహారమనే కాదు, వేపుడు వస్తువులు ఏమి తిన్నా, బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఇదే జరిగితే గుండెకి చాలా ప్రమాదం. అందుకే మాంసాహారంపై అతిగా ఆధారపడకండి. మాంసాహారం ముట్టినా, ఉడకబెట్టిన మాంసాన్నే తినండి.

No comments:

Powered by Blogger.