pop

4 టన్నుల బంగారం@2 రోజులు


దిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెలుపులోకి మార్చేందుకు పెద్దఎత్తున బంగారం కొనుగోళ్లపై వీరు దృష్టి సారిస్తున్నారు. బంగారు కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఎంతలా బంగారం కొనుగోళ్లు పెరిగాయంటే ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించిన రెండు రోజుల్లోనే 4,000 కేజీల బంగారం కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 374 పెద్ద నగల దుకాణాల్లో నవంబర్‌ 8 నుంచి రెండు రోజుల్లోనే 4 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగినట్లు ఆర్థిక పరిశోధన ఏజెన్సీలు చెబుతున్నాయి. బంగారు దుకాణాల్లో నగల విక్రయాలు ఐదు రెట్లు పెరిగాయని.. ఇవి పలు అనుమానాలకు దారితీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆ లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

No comments:

Powered by Blogger.