pop

53 శాతం మంది పిల్లలు ఆ సైట్లే చూస్తున్నారట... సర్వేలో బయటపడిన దారుణ వాస్తవాలు


లండన్ : పిల్లల జీవితాలను పోర్న్ సైట్లు పాడు చేస్తున్నాయని ఇంగ్లండ్ కల్చర్ సెక్రటరీ కరేన్ బ్రాడ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల వయసు నిర్ధారణ నిబంధనలను కఠినంగా అమలు చేయని ఇటువంటి వెబ్‌సైట్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సరైన వయసు నిర్ధారణ తనిఖీల కోసం ఓ రెగ్యులేటర్‌ను నియమించినట్లు తెలిపారు. ఈ నిబంధనలను పాటించని సైట్లపై ప్రభుత్వం నిషేధం విధిస్తుందన్నారు. బాలల దాతృత్వ సంస్థ ఎన్ఎస్‌పీసీసీ, ఇంగ్లండ్ చిల్డ్రన్స్ కమిషనర్ నిర్వహించిన అధ్యయనంలో దారుణమైన వాస్తవాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది. 11-16 సంవత్సరాల మధ్య వయస్కుల్లో 53 శాతం మంది అశ్లీలతను ఆన్‌లైన్ ద్వారా చూస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. బాల్యంలోనే అసభ్యకరమైన అశ్లీలతను చూడటం వల్ల యావత్తు తరం తమ బాల్యాన్ని కోల్పోతుందని తెలిపింది.

No comments:

Powered by Blogger.