pop

ఓ రైతు 63 రోబోలను తయారుచేశాడు


చైనాలో రోబోల వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమయానికి నిద్ర లేపడం నుంచి కథలు చెప్పి పడుకోబెట్టే వరకు అన్ని పనులూ చేసే రోబోలు చైనాలో కనిపిస్తూనే ఉంటాయి. అక్కడి శాస్త్రవేత్తలు.. ఇంజనీర్లు రోజుకో కొత్త రోబోను రూపొందిస్తూనే ఉంటారు. అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ.. ఓ రైతు తనకు ఇంటి, పొలం పొనుల్లో సాయపడతాయని స్వతహాగా 63 రోబోలు తయారు చేసుకున్నాడు. బీజింగ్‌కు చెందిన వూ యులు పాఠశాల విద్య పూర్తవ్వగానే చదువుకు స్వస్తి పలికాడు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించాడు. రోబోటిక్స్‌పై తనకున్న ఆసక్తిని మాత్రం పొగొట్టుకోలేదు. ఎలాగైనా మర మనుషులను రూపొందించాలనుకున్నాడు. పుస్తకాలు చదివి, నెట్టింట్లో వీడియోలు చూసి రోబోలు ఎలా రూపొందించాలో నేర్చుకున్నాడు. అప్పటి నుంచి 3 దశాబ్దాలుగా కష్టపడి 63రోబోలను తయారు చేశాడు. ఈ రోబోలు చైనీస్‌ చెస్‌ ఆడగలవు, బొమ్మలు గీయగలవు, వూ యులుని రిక్షాపై ఎక్కించుకొని బయటికి తీసుకెళ్లగలవు. ఇంకా అనేక రకాల పనులు చేస్తున్నాయి. ఎంతో ఇష్టంతో రూపొందించిన రోబోలను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాడు వూ యులు. అంతేకాదు ప్రతీ రోబోకు తన ఇంటి పేరును జోడించి పేర్లు పెట్టాడు. వూ లావొ దా, వూ లావొ శాన్‌, వూ లావొ లియు షి శాన్‌ ఇవి కొన్ని పేర్లు. వూ యూలు కుటుంబంలో రోబోల సంఖ్య పెరుగుతూనే ఉంది.

No comments:

Powered by Blogger.