pop

ఇది పులి కాదు శునక‌మే


ఉడుపి: శునక వ్యాఘ్రం..... ఇదేంటి? పేరే విచిత్రంగా ఉందే? అనుకుంటున్నారు కదూ! ఈ చిత్రాలు చూస్తే మీకూ అలాగే అనిపిస్తోందా? శునకం ఇలా వ్యాఘ్ర రూపం (చారల్ని) సింగారించుకుంది. ఓ ఆలోచన జీవితాన్ని మార్చింది..అన్న నినాదాన్ని ఒంటబట్టించుకున్న యువరైతు బుర్రలో ఈ కొత్త ఆలోచన పుట్టింది. వన్యప్రాణుల బెడద నుంచి పంటల్ని కాపాడుకునేందుకు అతను చేసిన ప్రయత్నమిది. దీనికి మంచి ఫలితం వస్తోందట. కర్ణాటకలోని ఉడుపి జిల్లా శిరూరు గ్రామానికి చెందిన యువ రైతు నాగరాజ్‌ ఇలా తన పెంపుడు కుక్కను పులిలా సింగారించాడు. కొండ ప్రాంతంలో పొలం ఉండడంతో తరచు జింకలు, వానరాలు, పందులు ఇతర వన్య ప్రాణుల దాడుల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చేదట. కంటిమీద కునుకు లేకుండా కాపలాగా ఉన్నా వన్యప్రాణుల దాడులు తప్పడం లేదట. దీనికి విరుగుడుగా ముదురు గోధుమ రంగులోని తన పెంపుడు కుక్కకు వెంట్రుకలు నల్లబడేందుకు వినియోగించే రంగు (హెయిర్‌ డై)తో పులిచారల్ని గీశాడు. నిత్యం తన వెంట దాన్ని పొలానికి తీసుకెళ్తున్నాడు. గ్రామస్థులు ఈ శునక వ్యాఘ్రాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. కొందరు ఇదేం వింత! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. పొలం చుట్టూ అది సంచరిస్తుంటే పులే వచ్చిందేమో! అనే భీతితో వన్యప్రాణులు పరిసరాలకు కూడా వచ్చేందుకు జంకుతున్నాయట. చూశారా? నాగరాజు ఎలా సూక్ష్మంలో మోక్షం సాధించాడో!

No comments:

Powered by Blogger.