pop

విదేశీ ప్రేమికులకు నోట్ల రద్దు సెగ...తాజ్‌మహల్ చూడాలనే కోరిక నెరవేరని వైనం


పెద్ద నోట్ల రద్దుతో విదేశీ పర్యాటకుల అవస్థలు ఆగ్రా : ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ చెంత బెంచీపై కూర్చోని ఆ విదేశీ ప్రేమికులు ఫోటో దిగాలనుకున్నారు...కాని వారి కల పెద్దనోట్ల రద్దుతో నెరవేరలేదు. అమెరికా దేశంలోని సీటెల్ నగరానికి చెందిన జాసన్ స్మిత్, సండ్రాలు ప్రేమికులు. వారిద్దరూ ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ ను చూడాలనే కోరికతో మన దేశంలోని ఆగ్రా నగరానికి వచ్చారు. తాజ్‌మహల్ అందాలను తిలకిద్దామని ఎంతో ఉద్వేగంగా ఆగ్రా చేరుకున్న ఆ విదేశీ ప్రేమికులకు గేటు దగ్గరే బ్రేకు పడింది. పురావస్తుశాఖ నిబంధనల ప్రకారం విదేశీ సందర్శకులు తాజ్‌మహల్ లోపలకు వెళ్లాలంటే వెయ్యిరూపాయల టికెట్లు తీసుకోవాలి. వారి వద్ద 500,1000 రూపాయల నోట్లు ఉన్నా అవి కాస్తా రద్దు కావడంతో చెల్లకుండా పోయాయి. దీంతో వారు తాజ్‌మహల్ చూడకుండానే నిరాశగా వెనుతిరిగారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో విదేశీ సందర్శకులు పలు అవస్థలు పడ్డారు. విదేశీ పర్యాటకులకు వంద రూపాయల నోట్లు లభ్యం కాక తినడానికి, రవాణాకు ఇబ్బందులు పడ్డారు. భారతదేశ సందర్శనకు విదేశీ పర్యాటకులు పెద్ద నోట్లు చెల్లుబాటు కాక, చిల్లర డబ్బులు లేక పలు ఇబ్బందులు పడ్డామని విదేశీ పర్యాటకులు చెప్పారు. నోట్ల రద్దు వల్ల భారత దేశ సందర్శన తమకు ఓ పీడకలగా మిగిలిందని జాసన్ స్మిత్, సండ్రాలు ఆవేదనగా చెప్పారు.

No comments:

Powered by Blogger.