pop

మాల్యాపై ఉచ్చు బిగిస్తున్న సీబీఐ


న్యూఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించే ప్రయత్నాలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముమ్మరం చేస్తోంది. ఇటీవలే మన దేశంలో పర్యటించిన బ్రిటన్ ప్రధాని థెరీసా మే‌తో కేంద్ర ప్రభుత్వం చర్చల నేపథ్యంలో సోమవారం సీబీఐ కీలక చర్యకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది మార్చి రెండున విదేశాలకు వెళ్ళిపోయిన మాల్యాను తిరిగి రప్పించేందుకు ముంబైలోని స్పెషల్ కోర్టులో అభ్యర్థనను దాఖలు చేసింది. మాల్యాపై నాన్ బెయిలబుల్ వారంట్‌ను ఇప్పటికే సాధించామని, తాజాగా ఆయనను తమ దేశానికి అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోర్టు ద్వారా కోరబోతున్నామని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ అభ్యర్థనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, విదేశాంగ శాఖకు పంపిస్తామని, అనంతరం బ్రిటన్‌ అధికారులకు పంపిస్తామని పేర్కొన్నాయి. గత 10 నెలల్లో మాల్యాకు సీబీఐ, ఈడీ సమన్లు జారీ చేశాయి. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు.

No comments:

Powered by Blogger.