pop

కిల్లీ కొట్టు యజమాని ఖాతాలో.. పది కోట్ల డబ్బులు జమ


పాట్నా: ఓ కిల్లీ కొట్టు యజమాని ఖాతాలోకి అనూహ్యంగా పది కోట్లు జమ అయ్యాయి. దీంతో అతడి బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. జార్ఖండ్‌ గిరిధ్ జిల్లాకు చెందిన పప్పు కుమార్ తివారీకి చెందిన ఎస్‌బిఐ ఖాతాలో రూ.4580 మాత్రమే ఉన్నాయి. శనివారం వెయ్యి రూపాయలు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్ళాడు. డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించగా బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయినట్లు తెలిసి అతడు షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆరగా తీయగా అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఒక్కసారిగా పప్పు కుమార్ తివారీ బ్యాంకు ఖాతాలోకి రూ. 9 కోట్ల 99 లక్షల 95 వేల 498 లు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ జరిగినట్లు సైబర్ టీం గుర్తించింది. అనుమానాస్పద లావాదేవీగా భావించి అతడి బ్యాంక్ అకౌంట్‌ను స్థంభింపజేశారు. అయితే తాను సాధారణ వ్యక్తినని తన ఖాతాలో లక్షన్నరకు మించి ఎప్పుడు జమ చేయలేదని తివారీ బ్యాంకు అధికారులకు తెలిపాడు. దీంతో అతడి ఖాతాలో జమ అయిన పది కోట్ల ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌పై దర్యాప్తు జరుపుతున్నారు.

No comments:

Powered by Blogger.