pop

ట్రంప్‌ నిర్ణయంతో ఇన్ఫోసిస్‌పై ప్రభావం


బెర్లిన్‌: అమెరికాలో ఇమ్మిగ్రెంట్లను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం ఇన్ఫోసిస్‌పై ప్రభావం చూపుతుందని ఆ సంస్థ సీఈవో విశాల్‌ సిక్కా అన్నారు. అయితే ఈ విషయమై కంపెనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. కంపెనీ భారీ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఇక్కడి ఉద్యోగులను తాత్కాలిక వీసాపై అమెరికాకు పంపలేమని.. అలాగే అమెరికాలో ఉద్యోగులను తీసుకోవడం చాలా వ్యయంతో కూడుకున్న పని అని అన్నారు. తమ కంపెనీలో అనుభవజ్ఞులైన ఉద్యోగులకు ఏమాత్రం కొదవలేదని చెప్పారు. అమెరికాలో చాలా యూనివర్శిటీలు ఉన్నాయి.. అక్కడ ఉద్యోగావకాశాలు కూడా తక్కువగా లేవు, కాగ్నిజెంట్‌ కంపెనీ లాగా అమెరికాలో ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ షేర్‌ నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని విశాల్‌ అన్నారు. గత నెలలో ఇన్ఫోసిస్‌ ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించింది. దీంతో విదేశీ సంస్థలు ఇన్ఫోసిస్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందుకు రావడంలేదు.

No comments:

Powered by Blogger.