pop

సిరాగుర్తు వాడకంపై ఈసీ అభ్యంతరం


దిల్లీ: బ్యాంకుల్లో నగదు మార్పిడి చేసుకున్న వారికి సిరా గుర్తు పెట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సిరా గుర్తు వాడకంపై గందరగోళం నెలకొనే అవకాశం ఉందని.. అందువల్ల సిరాగుర్తు వాడకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. పెద్దనోట్ల రద్దుతో పాతనోట్లు మార్చుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న సంగతి తెలిసిందే. రోజులు గడుస్తున్నా బ్యాంకుల్లో బారులు తరగకపోవడంపై కేంద్రం దృష్టి సారించింది. పాతనోట్లు మార్చుకుంటున్న వారు రోజులో ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తున్నారని.. దీంతోనే బ్యాంకుల్లో రద్దీ తగ్గడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీన్ని నివారించేందుకు నగదు మార్పిడి చేసుకున్న వారికి సిరాగుర్తు వాడాలని నిర్ణయించింది.

No comments:

Powered by Blogger.