pop

కుక్కల కంటే మనుషులు తక్కువ కాదు..: సుప్రీం


supremsuprem న్యూఢిల్లీ, నవంబర్ 17:కుక్కల కంటే మానవ జీవితం తక్కువ అనే భావన సృష్టించవద్దని గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. జంతు జనన నియంత్రణ నిబంధనల ప్రకారమే ఊరకుక్కలను చంపాలని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్‌తో కూడిన ధర్మాసనం సూచించింది. కుక్కలతోపాటు మానవ జీవితం కూడా అత్యంత పవిత్రమైనది. నిబంధనలకు లోబడే శునకాలను చంపాలి అని ధర్మాసనం పేర్కొన్నది. ఊర కుక్కలను చంపాలని ప్రచారం నిర్వహించడం, అందుకోసం శిక్షణ కూడా ఇవ్వాలన్న అంశంపై కేరళలోని జంతు సంరక్షణ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం విచారించింది. ఊరకుక్కలను చంపిన ఘటనల్లో ఏడుసార్లు అరెస్టయిన జోస్ అనే వ్యక్తిని 2017 మార్చి 1న జరిగే తదుపరి విచారణ సమయంలో కోర్టులో హాజరుపరుచాలని ధర్మాసనం సూచించింది. కుక్కలను చంపడం బెయిలబుల్ కేసు అని, రూ.50 చెల్లించి బెయిల్ పొందవచ్చనే విషయాన్ని సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ కోర్టు దృష్టికి తెచ్చారు.

No comments:

Powered by Blogger.