pop

వెంట్రుకలు, జుట్టుపై శ్రద్ధ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండండి!


ఆరోగ్యకరమైన జుట్టు కోసం..సహజ సౌందర్యం పెరగాలంటే జుట్టు ఎంతో అవసరం. ఈ జుట్టు ఆరోగ్యంగా ఉండి నిఘనిఘలాడాలంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు నగరంలోని ఎస్‌పీ బ్యూటీ పార్లర్‌ నిర్వాహకురాలు విష్ణు ప్రియ తెలియజేస్తున్నారు. వీటి ద్వారా కేశ సౌందర్యాన్ని పెంచుకోవచ్చన్నారు. పాటించాల్సినవి.. సాధ్యమైనంతవరకు హెయిర్‌స్టైలింగ్‌ చికిత్సలు, ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వాటిలో గాడత ఎక్కువగా ఉండే రసాయనాలు తాత్కాలికంగా మెరుపునిచ్చినా భవిష్యత్తులో జుట్టు ఎదుగుదలను నియంత్రిస్తాయి. కాబట్టి అలాంటి వాటిని వాడకపోవడమే మంచిది. జుట్టు మరీ పొడిగా కనిపిస్తుంటే కలబంధ గుజ్జు లేదా పెరుగును తలకు పట్టించి కాసేపయ్యాక కడిగేయాలి. జుట్టుకు కండీషనల్‌ వాడుతున్నా అప్పుడప్పుడు కలబంధ గుజ్జు రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేయాలి. దాని వల్ల జుట్టు మెరుస్తుంది. అలాగే రెండు టేబుల్‌ స్పూన్లు పెరుగులో టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలిసి తలకు పట్టించాలి. అర్ధగంటయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తుంటే జుట్టు మెత్తగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. తలను సాధ్యమైనంత పరిశుభ్రంగా నూనె లేకుండా ఉంచుకునేలా చేసుకోవాలి. అందుకోసం తరచూ తలస్నానం చేయాలి. దాని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని రోజు తలస్నానం చేస్తే తలలోని సహజనూనెలు పోతాయి. మీ జుట్టు తత్వానికి సరిపోయే కండీషనర్‌, షాంపులను మాత్రమే ఎంచుకోవాలి. అలాగే తడి తలను ఎట్టి పరిస్థితిలో దువ్వకూడదు. తలస్నానం కోసం గోరువెచ్చని లేదా చల్లటి నీటిని మాత్రమే వాడాలి. అప్పుడప్పుడు ఆముదాన్ని వేడిచేసి,దాన్ని తలకు రాసుకుని అర్ధగంట తరువాత కడిగేసుకుంటే మంచి కేశసౌందర్యం వస్తుంది.

No comments:

Powered by Blogger.