pop

పెదాలు పగలకుండా


శీతాకాలంలో పెదవుల పట్ల కాస్త ఎక్కువగానే జాగ్రత్త వహించాలి. ఇందుకు రసాయనాలతో నిండిన లిప్‌బామ్‌, జెల్‌ల వంటివి వాడాల్సిన అవసరంలేదు. అలాగెందుకంటే అవి ఇచ్చే ప్రభావాన్ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఒక గిన్నెలో తేనె, కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం స్క్రబ్‌ బేస్‌గా ఉపయోగపడుతుంది. అర టీస్పూన్‌ బ్రౌన్‌ షుగర్‌ను పెదవులపై రాసి నెమ్మదిగా రుద్దాలి. మృతచర్మం ఊడిపోయి పెదవులు మృదువుగా తయారవుతాయి. పెదవులకు తేమ అందించేందుకు కొబ్బరినూనె, తేనెల మిశ్రమం బాగా పనిచేస్తుంది. శీతాకాలంలో పెదవులు పొడిబారడం ఎంతో సహజం. ఈ మిశ్రమం వాడడం వల్ల పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి. అందంగా కనిపిస్తాయి.

No comments:

Powered by Blogger.