pop

వయసు కనబడకుండా!


కాలేజ్‌ ఏజ్‌లో అందంపై ఎక్కువ ఫోకస్‌ చేసే అమ్మాయిలు.. పెళ్లయిన తర్వాత మాత్రం అంతగా పట్టించుకోరు. అందుకే ముప్పయ్‌ దాటగానే వయసు పైబడినట్టు కనిపిస్తుంటారు. చిన్నచిన్న టిప్స్‌ ఫాలో అయిపోతే ఈ సమస్యను అధిగమించవచ్చు. చర్మ సౌందర్యానికి గుడ్డు భలేగా పని చేస్తుంది. ఒక టేబుల్‌ స్పూన్‌ గుడ్డు తెల్లసొనకు సగం టేబుల్‌ స్పూన్‌ మీగడ, సగం టేబుల్‌ స్పూన్‌ నిమ్మ రసం బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మీ అందం మరింత పెరుగుతుంది. విటమిన్‌-ఎ అధికంగా ఉండే క్యారెట్‌ ఆరోగ్యానికే కాదు అందానికీ దోహదం చేస్తుంది. క్యారెట్‌ ముక్కలు, సగం ఆలుగడ్డ ఉడికించాలి. తర్వాత వాటిని ముద్దగా చేసుకోవాలి. దీనికి చిటికెడు తినేసోడా, పుసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

No comments:

Powered by Blogger.