pop

తల్లి పోయింది... పిల్లలు మిగిలారు


IndorePatnaExpressకాన్పూర్, నవంబర్ 20: ఉత్తరప్రదేశ్ రైలుప్రమాదం ఎన్నో కుటుంబాలను కల్లోలపరిచింది. ఇద్దరు చిన్నారులు తమ తల్లిని కోల్పోయిన విషాదఘట్టం కూడా ఈ ప్రమాదంలో చోటుచేసుకుంది. బోల్తాపడి ధ్వంసమైపోయిన ఎస్-3 బోగీ నుంచి 6, 7 ఏండ్ల వయసున్న ఇద్దరు చిన్నారి బాలురను సహాయకసిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే... ఆ పిల్లల తల్లిని మాత్రం మృత్యువు కబళించింది. ఆమె మృతదేహం బోగీలో పిల్లల సమీపంలోనే పడిపోయి ఉందని సహాయకసిబ్బంది తెలిపారు. ప్రమాదంలో ధ్వంసమయిన మరో బోగీలో ఇద్దరు చిన్నారి బాలికలు చిక్కుకుపోయారని, వారిని సురక్షితంగా తీసుకొస్తామని జాతీయ విపత్తు స్పందన దళం కమాండెంట్ ఏకే సింగ్ భరోసా వ్యక్తం చేశారు. ఆ బోగీలోంచి పిల్లలను తీసుకురావటానికి క్రేన్లను ఉపయోగించలేమని, ఇతర సాధనాలను వినియోగించి వారిని కచ్చితంగా ప్రాణాలతో వెలుపలికి తీసుకొస్తామన్నారు. రైలుబోగీల్లో చిక్కుకుపోయిన వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన తర్వాత... పూర్తిస్థాయి తనిఖీ నిర్వహించి... మృతదేహాలేమైనా ఉన్నాయా అన్నది కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆపరేషన్‌ను ముగిస్తామని చెప్పారు. ఘటనాస్థలం వద్ద గుమిగూడిన జనంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Powered by Blogger.