pop

కాలివేళ్లతో ప్రపంచ రికార్డు!


DAMINIపుట్టుకతోనే రెండు చేతులూ లేకున్నా.. అద్భుత ప్రతిభ ఆమె సొంతం. కాలివేళ్లతో ఒక గంటలో 38 చిత్రాలు గీసిన చిత్రకారిణిగా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నది దామినీ సేన్. ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన దామినీ సేన్ పుట్టుకతోనే దివ్యాంగురాలు. రెండు చేతులు లేకుండా పుట్టిన ఈమెను అందరూ వింతగా చూసేవారు. దామినికి చదువుపై ఉన్న శ్రద్ధను గుర్తించిన తల్లిదండ్రులు, ఆమెను గురుకుల పాఠశాలలో చేర్పించారు. అందరు పిల్లల మాదిరికాకుండా దామిని కాలితో పెన్నుపట్టి అక్షరాలను దిద్దేది. తన పనులు, ఇంటి పనులనూ కాలి వేళ్లతోనే చేయడం నేర్చుకున్నది. టెన్త్‌లో 80శాతం మార్కులు తెచ్చుకొని.. మామూలు విద్యార్థులకు ఏమాత్రం తీసిపోనని నిరూపించింది. చిత్రలేఖనంపై కూడా ఎంతో ఆసక్తి కబనర్చేది. కాలి వేళ్లతోనే కుంచె పట్టుకొని చిత్రాలు వేయడం ప్రారంభించింది. అనేక రికార్డులను తన కాలి వేళ్లతోనే సొంతం చేసుకొని, తనను వికలాంగురాలని గేలిచేసిన వారి నోటితోనే ఔరా అనిపించింది

No comments:

Powered by Blogger.