pop

పొట్టిదంపతుల రికార్డు


Short-coupleప్రపంచంలోనే అతి పొట్టివాళ్లు వీళ్లిద్దరూ. పొట్టి, పోడవు వాళ్లు రికార్డు సృష్టిస్తే.. వీళ్లిద్దరూ ఒక్కటై ప్రపంచ రికార్డు నెలకొల్పారు బ్రెజిల్‌కు చెందిన పాలో గాబ్రియేల్ ద సిల్వా బారోస్, కత్యుషియా లీషినో. 31 ఏళ్ల బారోస్ ఎత్తు 90.28 సెంటిమీటర్లు. 28 ఏళ్ల హోషినో ఎత్తు 91.13 సెంటిమీటర్లు. 2006లో వీళ్లిద్దరూ సోషల్ మీడియా ద్వారా ఒకరినోకరు పరిచయమయ్యారు. ఇద్దరి ఎత్తులు దగ్గరగా ఉండడంతో వీళ్లు మంచి స్నేహితులయ్యారు. రోజూ ఆన్‌లైన్ చాటింగ్ చేస్తుండడం వల్ల వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారింది. చాన్నాళ్లు సోషల్ మీడియాలోనే మాట్లాడుకుంటున్నా ఇద్దరు 2008లో మొదటిసారిగా ఒకరినోకరు చూసుకున్నారు. ఆపై పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎనిమిదేళ్లపాటు వీళ్ల ప్రేమాయణం కొనసాగింది. లండన్‌లోని గిన్నిస్ రికార్డు హెడ్ ఆఫీస్ సమీపంలోని చర్చిలో జరిగిన వివాహంతో ఒక్కటయ్యారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా సరికొత్త రికార్డు నెలకొల్పారు. పెళ్లి వేడుక పూర్తైయిన తర్వాత జంట గిన్నిస్ రికార్డు ధృవీకరణ పత్రాన్ని అధికారుల నుంచి అందుకుని ఆనందంలో మునిగిపోయారు.

No comments:

Powered by Blogger.