pop

‘నువ్వు మొదలు పెట్టావ్... నేను పూర్తి చేస్తా’


వాషింగ్టన్: ‘పోరాటం నువ్వు మొదలుపెట్టావ్.. ఆ పోరాట లక్ష్యాన్ని నేను పూర్తి చేస్తా.. ఇప్పటివరకూ నువ్వు మా కోసం పోరాడావు.. నీ కోసం మేం పోరాడే సమయం వచ్చింది’... ఇది డెమొక్రటిక్ పార్టీ తరపున ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి ఓటమిపాలయిన హిల్లరీ క్లింటన్‌కు ఓ పదేళ్ల పాప రాసిన లేఖ సారాంశం. ఫ్లోరిడాలోని ఓర్లాండోకు చెందిన పదేళ్ల పాప కియా జేమ్స్.. హిల్లరీ అభిమాని. బుధవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో హిల్లరీ ఓడిపోవడంతో కియా చాలా బాధపడింది. కొన్ని గంటల పాటు ఏడ్చింది. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది.. తన నిర్ణయాన్ని ఓ లేఖపై రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహిళల కోసం ఇప్పటివరకూ పోరాటం చేసినందుకు కృతజ్ఞతలు... అంటూ లేఖను ప్రారంభించిన కియా.. తాను వ్యోమగామి అవుదామనుకున్నాననీ, అయితే మీరు కల్పించని ప్రేరణతో ఆ నిర్ణయాన్ని మార్చుకుని ప్రపంచ నేతగా ఎదగాలనుకుంటున్నానని ప్రకటించింది. అమెరికా ప్రెసిడెంట్‌గా తప్పకుండా గెలుస్తాననీ, అందుకు ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించుకుంటానని లేఖ రాసింది. మరి ఈ పదేళ్ల పాప... తన సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తుందో వేచి చూడాలి.

No comments:

Powered by Blogger.