pop

శ్రీశ్రీ జగన్మోహన్.., శత్రువునే: పవన్ కౌంటర్, చంద్రబాబుకు '2' హెచ్చరికలు


అనంతపురం: నేను ఏం మాట్లాడినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు చెబుతున్నారని, రాజకీయాలు అంటే తిట్టుకోవడం, దుర్భాషాలాడుకోవడమేనా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు వైసిపి అధినేత వైయస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను ఎవరికి అనుకూలం కాదన్నారు. తనకు చంద్రబాబు అయినా, శ్రీశ్రీ జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే అన్నారు. తనకు ఏ పార్టీతోను శతృత్వం లేదన్నారు. రాజకీయాలంటే తిట్టుకోవడమనే సంప్రదాయం బలపడిందని, జనసేన పార్టీది విధానాలు, సిద్ధాంతాలపై పోరాటమే తప్ప, వ్యక్తులపై పోరాటం చేయదని చెప్పారు. చంద్రబాబు కానీ, జగన్ పై కానీ వ్యక్తిగత వైరం లేదన్నారు. నేను ఏ పార్టీకైనా శత్రువునే ప్రజల సమస్యలు పరిష్కారం కాకుంటే నేను ఏ పార్టీకైనా చాలా పెద్ద శత్రువు అని గొంతు చించుకున్నారు. ఈ దోపిడీ రాజకీయ వ్యవస్థ ఇంకెంత కాలం అన్నారు. మనకు పౌరుషం ఉందా లేదా అని సభికులను ఉద్దేశించి మాట్లాడారు. నేను మీకోసం పోరాడుతున్నానని చెప్పారు. మీ పిల్లల కోసం పోరాడుతున్నానన్నారు. అలసిపోయాం... విసిగిపోయాం... ఇంకెంతకాలం ఈ మోసాలని ప్రశ్నించారు. ఇక చాలు ఇప్పటికైనా వ్యవస్థ మారాలన్నారు. నేను చేతులు కట్టుకుని కూర్చుంటే గౌరవ మర్యాదలు, డబ్బులు వస్తాయని, అన్నింటినీ ఫణంగా పెట్టి ప్రజా ప్రతినిధిగా వస్తున్నానని చెప్పారు. ఒక జనరేషన్ రాజకీయ నేతలు చేసిన తప్పుల కారణంగా ఈ రోజు ఈ దుస్థితికి దిగజారామన్నారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదన్నారు.

No comments:

Powered by Blogger.