pop

చనిపోయిన వ్యక్తి ఎన్నికల్లో గెలిచాడు


కాలిఫోర్నియా: వైసీపీ మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి గుర్తుండే ఉంటారు. గత ఎన్నికల సమయంలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఆమె.. ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. చనిపోయిన నాటికి ఈవీఎంలు సిద్ధమవడం, ఆమె పేరును పోటీదారుల లిస్ట్‌లో తీసేయడానికి వీలు కుదరకపోవడంతో ఆమె గెలిచినా.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సరిగ్గా అలాంటి ఘటనే అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. ఓసియన్‌సైడ్ సిటీ ట్రెజరర్‌కు జరిగిన ఎన్నికల్లో గేరీ ఎర్నెస్ట్ అనే వ్యక్తి గెలిచాడు. అయితే ఆయన సెప్టెంబర్ 23న మరణించారు. అప్పటికే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఆయన పేరును తొలగించడం కుదరలేదు. దీంతో మరణించిన వ్యక్తిని ఏం ఎన్నుకుంటారో అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా నవంబర్ 8న జరిగిన ఎన్నికల్లో 17వేల 659 ఓట్లు సంపాదించి గెలుపొందాడు. ప్రత్యర్థిపై 6 శాతం ఓట్లు ఎక్కువగా సంపాదించాడు కూడా. దీంతో అతడి ఎన్నికను డిసెంబర్ 7న అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్నికల్లో ఆయన గెలుపు తమను విస్మయానికి గురి చేసిందనీ, భౌతికంగా మన మధ్య లేని వ్యక్తి.. విధులు నిర్వహించలేడు కనుక.. త్వరలోనే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఓసియన్‌సైడ్ సిటీ అటార్నీ జాన్ ముల్లెన్ ప్రకటించారు. మరో 60 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు.

No comments:

Powered by Blogger.