pop

సర్వాయి పాపన్న ఆదర్శం


swamyసర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను రాసి ఉంటే ఈ రోజు ఛత్రపతి శివాజీ సరసన నిలిచేవారని, కానీ అలా జరుగలేదని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. ప్రతి ఇంటిపై పాపన్న స్టిక్కర్లను అతికించుకోవాలని సూచించారు. వనస్థలిపురం: సర్దార్ సర్వాయి పాపన్నను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ సూచించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆదివారం నిర్వహించిన శెట్టి, బలిజ, గౌడ కులస్థుల వనభోజనాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. పాపన్న చరిత్రను రాసేందుకు చరిత్రకారులకు చేతులు రాలేదని, ఒకవేళ రాసి ఉంటే ఛత్రపతి శివాజీ సరసన నిలిచే వారని చెప్పారు. ప్రతి ఇంటిపై పాపన్న స్టిక్కర్లను అతికించుకోవాలని సూచించారు. ఇక్కడ నివసించేవారంతా ఇక్కడి ప్రజలే అవుతారని, ఏ సమస్యవచ్చినా అండగా ఉంటానన్నారు. అత్తవారింటి వద్ద తల్లిగారి పాటపాడితే పద్ధతి కాదన్నారు. తెలంగాణలో జీవించే ప్రజలంతా ఈ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకోవాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కుల ధ్రువీకరణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో చర్చించానని పేర్కొన్నారు. ప్రభుత్వం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, దాని రిపోర్టు కోసం వేచిచూస్తున్నామని, అదిరాగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన సోదరులకు తానెప్పుడూ అండగానే ఉంటానన్నారు. వారి ఆస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం హామీ ఇస్తున్నదని తెలిపారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్థులు ఐక్యంగా ఉండాలని సూచించారు. ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో పాలన సాగుతున్నదని, ఎక్కడా ఎవరికీ ఇబ్బందులు కలుగడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లలకు ఆటలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎల్‌బీనగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న, సత్యనారాయణ, మట్టపల్లి చంద్రారావు, మూర్తి, రంజిత్ పాల్గొన్నారు

No comments:

Powered by Blogger.