pop

ప్రతి అమ్మాయి తప్పక తెలుసుకోవలసిన వివిధ రకాల స్కిన్ క్లీనర్స్ - See more at: allinonepopcorn.blogspot.in


సాధారణ చర్మ క్లీనర్స్ సాధారణ చర్మ క్లీనర్స్ చాలా సాధారణమైనవి మరియు సాధారణ చర్మ రకానికి వీటిని వాడాలి. ఈ రకం క్లీనర్స్ ను నీటితో వాడాలి, ఇవి సబ్బు లేదా జెల్ లేదా లిక్విడ్ రూపంలో అందుబాటులో గలవు. సాధారణ చర్మం గల వారు ఈ క్లీనర్స్ ను వాడటం వలన చర్మం మృదువుగా మరియు తేమభరితంగా మారుతుంది.
డ్రై క్లీనర్స్ పొడి చర్మం గల వారు సాధారణ చర్మ క్లీనర్స్ ను వాడకూడదు. కావున వీటికి బదులుగా డ్రై క్లీనర్స్ లను వాడటం వలన చర్మం శుభ్రపరచబడటమే కాకుండా, చర్మానికి కావలసిన తేమను కూడా అందిస్తాయి. డ్రై క్లీనర్స్ క్రీం లేదా ద్రావణ రూపంలో కూడా లభిస్తాయి.
ఆయిలి స్కిన్ క్లీనర్స్ జిడ్డు చర్మాన్ని లేదా ఆయిలి స్కిన్ కలిగి ఉండే వారు నీటి ఆధారిత క్లీనర్స్ లను లేదా డీప్ క్లీనింగ్ టెక్నిక్ లను వాడాలి. ఈ క్లీనర్స్ చర్మంపై ఉండే దుమ్ము, ధూళిలను తొలగించటమే కాకుండా, చర్మ రంద్రాలను శుభ్రపరచి, ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.
కాంబినేషన్ స్కిన్ క్లీనర్స్ పొడి లేదా జిడ్డు లేదా సాధారణ చర్మ రకాలకు చెందిని లేదా నిర్దారించలేని వారు సరైన pH గల లోషన్ లేదా క్రీములను వాడటం మంచిది.
సెన్సిటివ్ స్కిన్ క్లీనర్స్ సున్నితమైన చర్మం కలిగిన వారు కృత్రిమ డిటర్జెంట్ ఆధారిత క్లీనర్స్ లను వాడాలి. ఎందుకంటే, వీటిలో pH స్థాయిలు సాధారణ చర్మానికి అనుగుణంగా ఉంటాయి.

No comments:

Powered by Blogger.