pop

సిజేరియన్ తరువాత తల్లి తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు-Steps To Be Followed After Cesarean Operation


Dust Food Light Exercise Pregnancy Steps To Be Followed After Cesarean Operation Stitches Tight Clothes Photo,Image,Pics-నార్మల్ డెలివరీ ద్వారానే బిడ్డకి జన్మనివ్వాలని ప్రతీ తల్లికి ఉంటుంది. కాని కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు. ఇక తప్పదు అన్న సమయంలో సిజేరియన్ ఆపరేషన్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఆపరేషన్ నొప్పిని కలిగించవచ్చు. అలాంటప్పుడు తల్లి తన శరీరం పట్ల జాగ్రత్త వహించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. * సిజేరియన్ తరువాత కొంతకాలం పాటు బరువులు అస్సలు ఎత్తకూడదు. శరీరాన్ని ఒత్తిడికి గురిచేసే పనులేవి చేయకూడదు. * జీన్స్ వేసుకునే అలవాటు ఉంటే కొంతకాలం మానేయ్యడమే మంచిది. టైట్ బట్టలు పక్కనపెట్టాలి. * వ్యాయామం పూర్తిగా మానేసేకంటే, లైట్ ఎక్సర్ సైజ్ చేయాలి. మెల్లిగా, నెమ్మదిగా నడవాలి. * నొప్పి పూర్తిగా తగ్గేదాక, అసలు సెక్స్ లో పాల్గొనకపోవడమే మంచిది. ఈ విషయాన్ని భార్యభర్తలిద్దరు అర్థం చేసుకోవాలి. * స్టిచెస్ పై ఒత్తిడి పడేలా మాత్రం అస్సలు పడుకోవద్దు. కోలుకోవడం మొదలుపెట్టాక సైడ్ కి తిరిగి పడుకోవచ్చు. * మూత్ర విసర్జనని ఆపుకోవద్దు. ఎప్పుడూ వచ్చినా, వెంటనే పని పూర్తి చెయ్యాలి. అలాగే మల విసర్జన ఒత్తిడితో జరగకూడదు. ఫైబర్ కంటెంట్ దొరికే ఆహారం తింటూ, జీర్ణశక్తిని ట్రాక్ లో పెట్టుకోవాలి. * ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం కంపల్సరి. ఫ్యాట్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ వద్దు. లైట్ ఆహారాన్ని ప్రిఫర్ చేయండి. * దుమ్ముధూళిలో ఉండకూడదు. సిజేరియన్ జరిగిన పార్ట్ లో బ్యాక్టీరియా రాకుండా జాగ్రత్తపడాలి. అలాగే డాక్టరు సూచించిన మెడికేషన్ ని మాత్రమే క్రమం తప్పకుండా వాడాలి.

No comments:

Powered by Blogger.