pop

గాల్లో విమానం, లోపల పాము


విమానం టేకాఫ్ తీసుకుంది. అందరూ ఎవరి సీట్లో వాళ్లు కూర్చున్నారు. కొంత మంది పేపర్ చదువుతూ, కొంత మంది హాయిగా నిద్రపోతూ, కొంత మంది ఏదో తింటూ ఇలా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఇంతలో ఓ ప్రయాణికుడు లేచి తన బ్యాగ్‌ను లగేజీ కంపార్ట్‌మెంటులో పెట్టడానికి డ్యాష్‌బోర్డు తెరిచాడు. అంతే.. అందులో నుంచి బుస్‌స్‌స్... అంటూ ఓ పాము బయటకు వచ్చింది. ఖంగుతున్న ఆ ప్రయాణికుడు భయంతో పాము.. పాము అంటూ అరవటం మొదలు పెట్టాడు. దీంతో విమానంలో ప్రయాణికులందరూ కేకలు పెడుతూ భయంతో వణికిపోయారు. అప్పటికప్పుడు విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసే పరిస్థితి కూడా లేకపోయింది. ఉపాయం ఆలోచించిన క్యాబిన్ సిబ్బంది, పాము బయటకు రాకుండా దుప్పట్లతో ఆ లగేజీ కంపార్ట్‌మెంట్‌ను కప్పేసి తాడుతో కట్టేశారు. ఎవరిని చప్పుడు చేయకుండా ఉండాల్సిందిగా కోరారు. దీంతో ప్రయాణికులందరూ కిక్కురుమనకుండా కూర్చుండిపోయారు. ఎప్పుడు ల్యాండ్ అవుతామా ? అనుకున్నారు. ఈ సంఘటన ఆదివారం రోజు అమెరికాలోని టొరెన్ నుంచి మెక్సికో సిటీ వెళ్తున్న 'ఎయిరో మెక్సికో' డొమెస్టిక్ విమానంలో చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఏనిమల్ కంట్రోలర్ వారు వచ్చి ఆ పామును స్వాధీనం చేసుకున్నారు. 9 అడుగుల పొడవున్న ఆ పాము గ్రీన్ రెప్టైల్ రకానికి చెందినదిగా చెప్తున్నారు. కాగా, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. 'ప్రయాణం ఎలా జరిగింది..'? అని వీరిని ప్రశ్నిస్తే చెత్తగా జరిగింది, హాలీవుడ్ మూవీ ' స్నేక్స్ ఆన్ ఎ ప్లేన్' గుర్తుకు వచ్చిందని చెప్పారు. ఓ ప్రయాణికుడు విమానంలోని పామును తన మొబైల్ లో వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

No comments:

Powered by Blogger.