pop

'తేజస్విని' పేరుతో మహిళలకు ప్రత్యేక బస్సులు


ప్రత్యేకంగా మహిళల కోసం బస్సులను నడపునున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తేజస్విని పేరుతో మొదటి విడతలో 100 బస్సులను నవీ ముంబయి, థానే, కల్యాణ్-దోంబివిల్వీ, నాగ్‌పూర్ పట్టణాల్లో నడుపుతారు. వీటిని ఉదయం 7 నుంచి 11, సాయంత్రం 5 నుంచి 9 గంటల సమయాల్లోనే నడుపుతామని ఓ సీనియర్ అధికారి తెలిపాడు. ఉద్యోగాలు చేసుకునే మహిళలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ అధికారి తెలియజేశారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 300 బస్సులను నగరాల్లో నడపాలని నిర్ణయించుకుంది. 2016-17 వార్షిక బడ్జెట్‌లో మహిళల సురక్షిత ప్రయాణం కోసం రూ.50 కోట్ల కేటాయించినట్లు మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మన్‌గతివార్ ప్రకటించారు. దీన్ని బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ జగదీష్ పటేల్ స్వాగతించారు. ఈ ప్రత్యేక బస్సుల వల్ల మహిళ ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుందని, వీటిని డిమాండ్‌ను బట్టి ఆయా ప్రాంతాల్లో నడుపుతామని ఆయన తెలిపారు. అయితే దీనిపై రవాణ రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. బెస్ట్ ఆధ్వర్యంలో నడిచే బస్సులు సమయానికి చేరుకోవు, అలాంటప్పుడు ఈ సర్వీసులను ఆ సంస్థ ఎలా నడుపుతుందని నిపుణులు అంటున్నారు. కొంత మంది మాత్రం వీటిని నడపాల్సిన అవసరం ఉందని అంటున్నారు. థానే, నవీముంబై నుంచి ముంబైకు చాలా మంది ప్రజలు ప్రయాణిస్తారని ఈ రూట్లో మహిళ ప్రయాణికులకు వీటి వల్ల ఉపయోగం ఉంటుందని హెచ్‌ఆర్ ప్రొఫెషనల్ ప్రభామణి అన్నారు.

No comments:

Powered by Blogger.