pop

ట్రంపే ప్రెసిడెంట్... చరిత్ర సృష్టించిన డొనాల్డ్!


అమెరికా ఎన్నికల్లో విజేత ఎవరో తేలిపోయింది. సౌమ్యురాలిగా, ఆలోచనాపరురాలిగా పేరు తెచ్చుకున్న హిల్లరీకి జనం మొండి చెయ్యి చూపారు. మొదటి నుంచి ఆవేశపూరిత ప్రసంగాలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన ట్రంప్ వైపే జనం నిలిచారు. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం 538 ఎలక్ట్రోరల్ ఓట్లకు గానూ ట్రంప్‌కు 276 ఓట్లు, హిల్లరీకి 218 ఓట్లు నమోదయ్యాయి. అధ్యక్ష స్థానాన్ని పొందాలంటే కనీసం 270 ఓట్లు పొందాలి. ఈ మ్యాజిక్ ఫిగర్‌ను ట్రంప్ దాటేశారు. ఇప్పటివరకూ జరిగిన ఎలక్షన్ల కౌంటింగ్‌ను ఒక్కసారి పరిశీలిస్తే మొదట్లో హిల్లరీ ఆధిక్యాన్ని కనబర్చినప్పటికీ చివరికి ట్రంప్‌కే జనం మద్ధతు తెలిపారు. అయితే ఎలక్ట్రోరల్ ఓట్లలో ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ ఓట్ల శాతంలో మాత్రం ట్రంప్ ఒక్క శాతం మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ట్రంప్‌పై పలు విమర్శలొచ్చాయి. కూతురిపై కూడా అసభ్యకర కామెంట్స్ చేశారంటూ ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ వ్యతిరేకత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించకపోవడం గమనార్హం.

No comments:

Powered by Blogger.