pop

లక్కంటే ఆమెదే.. రోడ్డుపై వెళుతుంటే డబ్బుల సంచి దొరికింది..


పూణె: రూ. 100, రూ. 1000 నోట్లు ఇక చెల్లవని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి రెండు రోజులు కూడా పూర్తి కాక ముందే దాని ప్రభావం విపరీతంగా కనబడుతోంది. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు తీసుకోవాలంటే వాటిని బ్యాంక్‌లో డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుంది. అయితే అందుకు బ్యాంక్ వారికి లెక్క చెప్పాలి. దీంతో నల్లధనం ఉన్న పలువురు వాటిని ఎక్కడ దాచాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. ఈ కోవలోనే నోట్లతో నిండి ఉన్న ఒక ప్లాస్టిక్ బ్యాగ్ రోడ్డు మీద దొరికింది. అది కూడా చెత్త శుభ్రం చెయ్యడానికి ప్రయత్నించిన పెద్ద వయసు కార్మికురాలికి. దీంతో షాక్‌కు గురైన ఆమె ఆ విషయాన్ని తన పై అధికారికి తెలిపింది. ఆయన ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో దీనిపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ డబ్బు మొత్తాన్ని లెక్కిస్తే రూ. 52వేలు ఉంది. ఒకే చోట పడేస్తే అనుమానం వస్తుందని చాలా చోట్ల ఇలా డబ్బు సంచులు పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Powered by Blogger.