pop

నటించాలని ఉంది.. కానీ బద్ధకం ఎక్కువ


బాలీవుడ్‌లో కాజోల్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా ఉన్న కాజోల్‌.. అజయ్‌ దేవగణ్‌ను వివాహం చేసుకుని నటనకు విరామం ఇచ్చింది. తర్వాత అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ వస్తోంది. తాజాగా తనకి యాక్షన్‌ పాత్రలు చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. కానీ.. బద్ధకమేస్తోందని ఫీలవుతోంది. కాజోల్‌ పలు చిత్రాల్లో ప్రియురాలిగా.. భార్యగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించింది. కానీ.. ఎప్పుడూ యాక్షన్‌ స్టంట్స్‌ చేయలేదు. ఇప్పుడు చేయాలనిపిస్తోందట. ‘‘యాక్షన్‌ సినిమాల్లో నటించాలని ఉంది. కానీ.. నాకు బద్ధకం ఎక్కువ. యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో నటులకి అమర్చే తాళ్లు.. భద్రత కోసం తీసుకునే చర్యలు అవన్నీ తలుచుకుంటే చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో నన్ను నేను వూహించుకోలేను. అయితే.. యాక్షన్‌ సీన్లలో నటించిన అనుభవం పొందడానికైనా అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది’’ అని తన కోరికను బయటపెట్టింది. ఇన్నాళ్లూ తెరపై అందాలు ఒలకబోసిన ఈ అమ్మడికి.. యాక్షన్‌ సీన్లలో నటించే అవకాశం ఎప్పుడొస్తుందో చూడాలి.

No comments:

Powered by Blogger.